పుట:అక్షరశిల్పులు.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

అయినప్పటి నుండి వివిధ పత్రికలు, సంకలనాలలో వ్యాసాలు, కవితలు చోటుచేసుకున్నాయి. రచనలు: 'భారతీయ ముస్లింల ముఖచిత్రం' (1998లో 'పుట్టుమచ్చ' కవి మహమ్మద్‌ అబ్దుర్‌ ఖాదర్‌ మొయినుద్దీన్‌తో కలసి). లక్ష్యం: సమాజం ప్రగతి దిశగా సాగే చైతన్యం కలుగచేయాలని. చిరునామా: ఎం.డి రియాజ్‌, ఇంటి నం.2-7-496, ఎక్సైజ్‌ కాలనీ, హన్మకొండ, వరంగల్‌ జిల్లా. దూరవాణి: 98490 22931.

రియాజుద్దీన్‌ అహమద్‌ షేక్‌: అనంతపురం జిల్లా అనంతపురంలో1961 ఏప్రిల్‌ 30న జననం. తల్లితండ్రులు: ఖైరున్నీసా-మెహరున్నీసా, ఎస్‌. అల్లాబక్ష్. చదువు: ఎం.ఏ.,

యం.ఫిల్‌. ఉద్యోగం: ఉపాధ్యాయులు. 1985లో కళాశాల

పత్రికలో అదృష్టం,'సామాన్యుని వ్యధ' కవిత , వ్యాసం రాయడంతో రచనా వ్యాసంగం ఆరంభమైంది. అప్పటి నుండి వివిధ పత్రికలలో, కవితా సంకలనాలలో కవితలు, సాహిత్య వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 'ఉమర్‌ అలీషా నాటకాలు- విస్లేషణ, 'సాహిత్యం-సహజీవనం' (సాహిత్య విమర్శనా వ్యాసాలు) గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ వ్యాసాలతోపాటుగా పలు ప్రసంగ వ్యాసాలు ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. లక్ష్యం: ముస్లిం కవులు రచించిన తెలుగు నాటకాల విశిష్టతలను పదిమంది దృష్టికి తీసుకురావడం. చిరునామా: షేక్‌ రియాజుద్దీన్‌ అహమద్‌, ఇంటి నం.7/502, రహమత్‌ నగర్‌, అనంతపురం-515001, అనంతపురం జిల్లా. సంచారవాణి: 94419 83007.

రుక్వుద్దీన్‌ కె. డాక్టర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా రాచూరులో 1947 మే రెండున జననం. తల్లితండ్రులు: చాంద్‌బీ, జహంగీర్‌ సాహెబ్‌. చదువు: యం.ఏ (తెలుగు)., యం.ఏ

(సంసృతం)., పి . హెచ్‌ డి . ఉద్యోగం : ఉస్మానియావిశ్వ

విద్యాలయంలో అధ్యాపకులు. 1965లో 'పంచాయితీ రాజ్యం' పత్రికలో ప్రచురితమైన తొలి కవితతో రచనా వ్యాసంగం ఆరంభంఅయినప్పటినుండి వివిధ పత్రికలు, కవితా-కధా సంకలనాలల్లో కవితలు, సాహిత్య-సమీక్షా- విమర్శనా వ్యాసాలు చోటుచేసుకున్నాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పలు ప్రసంగ వ్యాసాలు ప్రసారం అయ్యాయి. రచనలు: 1. విప్లవ ఢంకా (గేయాలు), 2.జానపదం-అలంకారం (సిద్ధాంత వ్యాసం), 3. విశ్వదర్శనం (కవితా సంపుటి), 4. మోదుగ పూలు (సామాజిక వ్యాసాలు), 5. కిన్నెర మెట్లు (జానపద పరిశోధక వ్యాసాలు), 6. శెలిమె (వ్యాస సంపుటి), 7. సూక్తి సుధా (అనువాద గ్రంథం), 8. ప్రయాణం (దీర్ఘ… కవిత), 9. రుగ్వాణి (పద్య కావ్యం). 1993లో

131