పుట:అక్షరశిల్పులు.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

గ్రంథాలు వెలువడ్డాయి. వీటిలో హదీసు కిరణాలు, ఇస్లామీయ ఆరాధనలు, ఖుర్‌ఆన్‌ సందేశం, ఖుర్‌ ఆన్‌ కథామాలిక లాంటి గ్రంథాలు గుర్తింపును తెచ్చిపెట్టయి. బృహత్తర గ్రంథం 'అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌' (అనువాదం-వ్యాఖ్యానం) ప్రచురణలో సహకారం. లక్ష్యం: సత్య సందేశాన్ని పదిమందితో పంచుకోవడం. చిరునామా: షేక్‌ ముహమ్మద్‌ అబ్దుల్‌ రసూల్‌, ఇంటి నం.16-2-862, అక్బర్‌బాగ్, సైదాబాద్‌, హైదారాబాద్‌ -500059. సంచారవాణి: 93473 86588.Email: abuanas2007@gmail.com

రసూల్‌ షేక్‌: శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జన్మస్థలం. రచనలు: మిత్ర బోధనామృతము.

రవూఫ్‌ అబ్దుల్‌ షేక్‌ డాక్టర్‌: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ (హిల్‌కాలనీ)లో 1962 డిసెంబర్‌ 22న జననం. తల్లితండ్రులు: షేక్‌ సమీవున్నీసా, షేక్‌ నూర్‌ అహమ్మద్‌. చదువు: ఎం.బి.బి.యస్‌. వృత్తి: వైద్యం. 1978లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన 'నాగరికపుటడవి' కవితతో రచనా వ్యాసంగం ఆరంభం. వివిధ పత్రికలలో కవితలు, కథానికలు, కథలు,

వ్యాసాలు చోటు చేసుకున్నాయి. రచనలు: 1.అంతర్నేత్రం, 2.

ముఖచిత్రం, 3.విశాఖపట్నం, 4. కనురెప్పల కిటికీ రెక్కల మధ్య..., 5. పారిస్‌ నగరం, 6.కదిలే కాలం, 7.అంతస్సూత్రం, 8. సముద్రపుటలలు, 9.లాంగ్ మార్చ్‌ (2009), 10.మళ్ళీ మరో ప్రస్థానం (2010) కవితా సంపుటాలు; 11.మధుమేహాన్ని జయించడమెలా, 12.డయాబెటీస్‌ హెల్త్‌ గైడ్‌ (ఆంగ్లం). అవార్డులు: శ్రీశ్రీ అవార్డు (1984, విశాఖపట్నం), పోలవరపు కోటేశ్వరరావు కవితా పురస్కారం, జ్వాలాముఖి స్మారక కవితాపురస్కరం (2009, విజయవాడ ) లక్ష్యం: స మసమాజం.చిరునామా: డాక్టర్ యస్‌.ఏ.రవూఫ్‌, ఇంటి నం.13-8-172, ఓల్డ్‌క్లబ్‌ రోడ్డు, నందిని లాడ్జి ప్రక్కన, కొత్తపేట, గుంటూరు-522001, గుంటూరు జిల్లా. సంచారవాణి: 98490 41167. Email: ravufsa4@yahoo.co.in

రియాజ్‌ మహమ్మద్‌: వరంగల్‌ జిల్లా ముత్యాలపల్లిలో 1970 జూన్‌ 24న జననం. తల్లి తండ్రులు: అహమద్‌బీ, అబ్బాస్‌. చదువు: ఎం.ఏ(పొలికల్‌ సైన్స్‌)., ఎం.ఏ (ఫిలాసఫీ)., ఎం.ఏ (ఎడ్యుకేషన్‌)., ఎం.ఫిల్‌. వృత్తి: అధ్యాపకులు. కలం పేర్లు: ఉజ్వల్‌, ఆజాద్‌. ఆంగ్లం, తెలుగులో ప్రవేశం. 1983లో ప్రపంచ శాంతి కాంక్షిస్తూ 'ఉగాది' శీర్షికతో రాసిన కవితతో రచనా వ్యాసంగం అరంభమై 1994లో 'వేకువ కోసం' కవిత ప్రచురితం

130