పుట:అక్షరశిల్పులు.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఎం.ఏ., ఎం.ఇడి. ఉద్యోగం: విశ్రాంత చరిత్ర అద్యాపకులు. 1961లో 'ఆంధ్రమహిళ'

పత్రికలో ప్రచురితమైన 'ఒరిపిడిరాళ్ళు' కవితతో ఆరంభమై వివిధపత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథలు, వ్యాసాలు, పద్యాలుచోటుచేసుకున్నాయి. రచనలు: బాబ్రీ మసీదు (ఒక చారిత్రకపరిశీలన, 1990), భారతీయ ముస్లింలు (నిన్న-నేడు-రేపు),2003, హజ్‌, ఉమ్రా ఔర్‌ జియారత్‌ (2004), ముస్లింమతాచారాలు (2005), కంబ్లివాల (మహమ్మద్‌ ప్రవక్త జీవిత

చరిత్ర, 2009). లక్ష్యం: అట్టడుగున పడి కన్పించని వాస్తవాలను వెలికి తీయాలన్నది. చిరునామా: షాలీ రహంతుల్లా, ఇంటి నం. 6-1-911, కోవూరు నగర్‌ ఎక్స్‌టెన్ష్‌న్‌, అనంతపురం-515004, అనంతపురం జిల్లా. సంచారవాణి: 08554-233402.

రహమతుల్లా నూర్‌బాషా: గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెంలో 1959 ఏప్రిల్‌ 18న జననం. తల్లితండ్రులు: నూర్‌బాషా రోషన్‌బి, నూర్‌బాషా మౌలాలి. కలం పేరు: నూర్‌బాషా. చదువు: యం.కామ్‌. ఉద్యోగం: స్పెషల్‌ డిప్యూీ కలక్టర్‌. 1978లో విద్యార్థిగా కళాశాల పత్రికలలో 'తుఫాను మీద విజయం' కవిత రాయడంతో రచనా వ్యాసంగం ఆరంభం. ప్రజల సమస్యలను విశ్లేషిస్తూ, పరిష్కారాలు సూచిస్తూ ఉత్తరాలు,

వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం. ఆంగ్ల భాషలోని ఆర్థిక- సామాజిక - ధార్మిక వ్యాసాలను తెలుగులోకి అనువదించి వెలువరించడం పట్ల ప్రత్యేక ఆసక్తి. ఇస్లాం-క్రైస్తవం మీద రాసిన తులనాత్మక వ్యాసాల పరంపర మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వ అధికారిక వ్యవహారాలు, ఉత్తర-ప్రత్యుత్తరాలు ప్రజల భాష తెలుగులో సాగాలన్న ప్రయత్నాలకు ఆచరణ రూపం ఇస్తూ 2008లో 'భూసేకరణ అవార్డు'ను రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆంగ్లంలో కాకుండ తెలుగు భాషలో రాసి పలువురికి మార్గ దర్శకులయ్యారు. రచనలు: తెలుగు అధికార భాష కావాలంటే (2004). పురస్కారాలు: తెలుగు భాషా పురస్కారం (2004, హైదారాబాద్‌). లక్ష్యం: తెలుగు భాషలో ప్రభుత్వం వ్యవహారాలు సాగించాలి, ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో జరగాలన్నది. చిరునామా : నూర్‌ బాషా రహమతుల్లా, ఇంటి.నం. 11-121, పోలకంపాడు, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. సంచారవాణి: 97035 43390, Email: nrahmthulla@yahoo.com

రహిమాన్‌ ఎస్‌: అనంతపురం నివాసి. 1984 ప్రాంతంలో అనంతపురం జిల్లా

126