పుట:అక్షరశిల్పులు.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

రహమతుల్లా షేక్‌: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 1963 ఫిబ్రవరి పదిన జననం. తల్లితండ్రులు: రొఖయాబి, షేక్‌ గఫూర్‌. కలంపేరు: బా రహమతుల్లా. చదువు:

ఎం.ఏ (లిట్). ఉద్యోగం: బిఎస్‌ఎన్‌యల్‌ (హైదారాబాద్‌). 1994 ఫిబ్రవరి 25నాటి ఆంధ్రజ్యోతి వారపత్రికలో 'తెలివి ఎవడి సొమ్ము' కద

ప్రచురితమైనప్పటినుండి వివిధ పత్రికల్లో కథలు, కథానికలు, కవితలు చోటుచేసుకున్నాయి. 2003లో వెలువడిన 'బా' కథల సంపుటి మంచి గుర్తింపు తెచ్చిపెట్టి షేక్‌ రహమతుల్లాను కాస్తా 'బా రహమతుల్లా' గా మార్చేసింది. 'బా' కవితా సంపుటి ఉర్దూలో తర్జుమా చేయబడి 2006లో ప్రచురితమైంది. రచనలు: 'బా'(కథల సంపుటి, 2004), 'పీపల్‌ మే నీం' (కవితల సంపుటి, 2007), 'మా' (కథల సంపుటి, 2009). పురస్కారాలు- అవార్డులు: విశాల సాహితి బి.ఎస్‌ రాములు కథా పురస్కారం (2004), హసన్‌ ఫాతిమా సాహితీ స్మారక ఆత్మీయ పురస్కారం (ఒంగోలు, 2008), శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఉగాది పురస్కారం (హైదారాబాద్‌, 2009). లక్ష్యం: మరుగున పడుతున్న మానవత్వాన్ని పట్టం కట్టడం. చిరునామా: బా రహమతుల్లా, ఫ్లాట్ నం. 104, సాయి చైతన్య అపార్ట్‌మెంట్స్, డిఎస్‌ఎన్‌ అర్‌, హైదారాబాద్‌-60. సంచారవాణి: 94908 06022,Email:juggymeraj@yahoo.co.in

రహమతుల్లా షేక్‌: ప్రకాశం జిల్లా ఒంగోలులో 1938 నవంబర్‌ నాల్గున జననం. తల్లితండ్రులు: షేక్‌ రహమతున్నీసా, షేక్‌ మహబూబ్‌ సాహెబ్‌. చదువు: బి.కామ్‌ (ఆనర్స్‌), ఎసిఎస్‌, ఎసిఐఎస్‌. ఉద్యోగం: వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు (రిటైర్డ్‌). మూడు దాశాబ్దాల క్రితం రచనా వ్యాసం ఆరంభం. కళాశాల మ్యాగ్ జైన్స్‌లో, ఇతర పత్రికలలో వివిధ అంశాల మీద వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. 1975లో 'ముహమ్మద్‌ జీవిత చరిత్ర' అను గ్రంథం రాసినా అది 2010లో వెలువడింది. రచనలు: 1. ఇస్లాంను రక్షించిన మేధావులు (2009), 2. షరియత్‌ (2010), 3. ఇస్లాం చరిత్ర (2010), 4. మహమ్మద్‌ జీవిత చరిత్ర (2010), 5. ఉస్‌వా-యే-రసూలే కరీం (ఉర్దూ నుండి తెలుగు అనువాదం, 2010). లక్ష్యం: ఇస్లాం ఔనత్యాన్ని, ఘన చరిత్రను ప్రజలకు సులభగ్రాహ్యమైన తీరులో వివరించడం. చిరునామా: షేక్‌ రహమతుల్లా, ఇంటి. నం.జి-1, రాహుల్‌ అపార్ట్‌మెంట్స్, వైవి రావు అసుపత్రి దగ్గర, లబ్బీపేట, విజయవాడ-10, కృష్ణా జిల్లా. దూరవాణి: 0866-2486390.

రహంతుల్లా షాలీ: అనంతపురం జిల్లా వజ్రకరూరులో 1942 జనవరి పదిన జననం. తల్లితండ్రులు: సాహెబ్‌బీ, మహబూబ్‌ సాహెబ్‌. కలం పేరు: షాలీ. చదువు:

125