పుట:అక్షరశిల్పులు.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


అనంతపురంలోని స్టేషన్‌ రోడ్డులో నివాసం. రచనలు: నీలం రాజు.

రహిమాన్‌ ఎస్‌.ఎ: గుంటూరు జిల్లా మాచర్ల తాలూకా ఓబులేసునిపల్లె జన్మస్థలం. పుట్టిన తేది:15-08-1946. తల్లితండ్రులు: అమీర్‌బీ, అల్లీ సాహెబ్‌. చదువు: పియుసి. రచనలు: పరివర్తన గేయాలు.

రాజ్‌ మహమ్మద్‌ డాక్టర్‌: వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేరు గ్రామంలో 1959 ఏప్రిల్‌ ఒకిన జననం. తల్లితండ్రులు: యాఖూబీ, అబ్దుల్లా. కలంపేరు: రాజ్‌,

రాజ్‌ ముహమ్మద్‌. చదువు : ఎం.ఏ., పి.హెచ్‌డి. ఉద్యోగం:

ఉపాధ్యాయులు. 1987లో తొలి వ్యాసం ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభమై పలు వ్యాసాలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి. 1998 ఏప్రిల్‌ 12న ప్రజాతంత్ర పత్రికలో ప్రచురితమైన 'అగ్రరాజ్యం చేతుల్లోకి వేపచెట్టు' వ్యాసం గుర్తింపు తెచ్చిపెట్టింది. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ఆంధ్ర ప్రదేశ్‌ జానపద సాహిత్యం మీద సమర్పించిన ప్రసంగ వ్యాసాలు ఆకాశవాణి, దూరదర్శన్‌, టెలివిజన్‌ ఛానెల్స్‌లో ప్రసారం. పురస్కారాలు : జానపద సాహిత్య పురస్కారం. లక్ష్యమ్: ప్రజా చైతన్యం. చిరునామా : డాక్టర్‌ రాజ్‌ మహమ్మద్‌ ఇంటి నం.6-4-21, హన్మకొండ-506011, వరంగల్‌ జిల్లా. సంచారవాణి: 99480 37665.

రజా హుస్సేన్‌ అబ్దుల్‌: గుంటూరు జిల్లా మంగళగిరిలో 1957 ఏప్రిల్‌ 11న జననం. కలం పేరు: మహతి. తల్లితండ్రులు: ఫరీద్‌బీ, అబ్దుల్‌ రసూల్‌. చదువు: బి.ఏ (లిట్)., ఎం.ఏ., ఎం.ఫిల్‌. ఉద్యోగం: తెలుగు అధ్యాపకత్వం. ఆ తరువాత 'ఈనాడు'

దినపత్రికలో పాత్రికేయుడిగా ఎనిమిదేళ్ళు బాధ్యతల నిర్వహణ.

ప్రస్తుతం రాష్ట్ర ప్రబుత్వాధికారి. 1972 నుండి విద్యార్థిగా కళాశాల మ్యాగ్ జైన్‌లో రాయడం ద్వారా రచనా వ్యాసాంగం ఆరంభం. అప్పటినుండి వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథానికలు, గల్పికలు, సాహిత్య వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు ప్రచురితం. ప్రొఫెసర్‌ తూమాటి దోణప్ప ప్రోత్సాహంతో 1988లో తొలి పుస్తకం 'పింగళి వెంకయ్య' ప్రచురించారు. రచనలు: 1. పింగళి వెంకయ్య (1988), 2.ఆనవాలు (సాహిత్య వ్యాసాల సంకలనం, 2005), 3. చుక్కా రామయ్య (జీవిత కథనం), 2006, 4. బాలల కలామ్‌, 2006, 5. ఇంటి భాష (2005), 6. తిరంగా ముసల్మాన్‌ (కవితలు) 2006, 7. చేవ్రాలు (సాహిత్య

127