పుట:అక్షరశిల్పులు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ గ్రంథాంలో పేర్కొన్నరచయితలలో నేను అభిమానించిన వారు, నాకు వ్యక్తిగతంగా తెలిసిన వారు కొందరున్నారు. వారిని గురించి చదివినప్పుడు రచయిత కొద్ది పంక్తుల్లోనే చెప్పవలసిన ముఖ్యవిశేషాలన్నిటినీ చెప్పారన్న భావన కలిగింది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా అనువాదం చేసిన ఉమర్‌ ఖయ్యూం రుబాయిలు తెలుగు సాహిత్యంలో చిరకాలం నిలుస్తాయి. నా చిన్నతనంలో ఆయన పద్యాలను కంఠస్థం చేసిన వాళ్ళం చాలామంది ఉండేవాళ్లం. కాని ఇరవై ఒకటవ శతాబ్దం ఆరంభంలో ఉమర్‌ అలీషా గురించి తెలిసినవారు బహు కొద్దిమంది. ఆయన గురించి సమకాలీన సమాజం తెలుసుకొనవలసిన అవసరం ఉంది. ఈయన మీదా ఇప్పికే శ్రీ నశీర్‌ అహమ్మద్‌ రాసిన పలు వ్యాసాలు ఆ కొరతను తీర్చుతున్నాయి. అలాగే శ్రీ జైనుల్‌ అబిదీన్‌ ఖుర్‌ఆన్‌, భగవద్గీతను కూడ అధ్యయనం చేసి సాధికారిక ఉపన్యాసాలు ఇస్తుండేవారు. తెలుగు పాఠకులకు ఇస్లాం గురించి వీలయినంత ఎక్కువ అవగాహన కలిగించాలన్నలక్ష్యంతో కృషిచేస్తున్న శ్రీ యస్‌.ఎం మలిక్‌ నాకు సన్నిహితంగా తెలిసినవారు. అలాింటివారే ఖుర్‌ఆన్‌ను తెలుగులోకి అనువాదాం చేసిన హమీదుల్లా షరీఫ్‌ గారు. జర్నలిస్టు మిత్రులు దేవీప్రియ, రచయిత అబ్దుల్‌ రజా హుస్సేన్‌, ప్రసిద్ధా కవులు మహమ్మద్‌ ఇస్మాయిల్‌, చెట్టు ఇస్మాయిల్‌ గార్ల సమాచారం చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం, సంతృప్తి కలిగాయి. ఈ గ్రంథాన్ని రూపొందించేందుకు ఎంతగా శ్రమించవలసి వచ్చిందీ ఊహించదగిన విషయమే అయినా శ్రీ నశీర్‌ అహమ్మద్‌ 'మీతో నా మాట' లో ఆ కష్టాలను స్వయంగా వివరించారు. ఈ గ్రంథం ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం అనిపించింది. దానిని అనుభవించ వలసింది పాఠకులు. మొక్కనాటి చెట్టును పెంచి, కాయలు కాయించేది ఇతరుల కోసమే గదా! ఇంత మంచి ప్రయోజనాత్మక గ్రంథాన్ని రూపొందించిన శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ముమ్మాిటికీ అభినందనీయులు.

తెలుగులో రాసిన, ప్రస్తుతం రాస్తున్న సుమారు 333 మంది కవులు, రచయితలు,అనువాదాకుల వ్యక్తిగత, సాహిత్య విశేషాలను సమకూర్చడం చాలా శ్రమతో కూడుకున్నది. ఈ తరహా గ్రంథాల రూపకల్పన విశ్వవిద్యాలయాలు, వ్యవస్థలు, అధ్యయన సంస్థలు మాత్రమే చేయగలవు. అటువంటి బృహత్తర బాధ్యతలను వ్యక్తిగా శ్రీ నశీర్‌ అహమ్మద్‌ ఒక్క చేత్తో విజయవంతంగా నిర్వహించడం ఆయన శ్రమ, కృషి, పరిశోధానాత్మక దాష్టికి తార్కాణం. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నవందాలాది ముస్లిం యోధుల జీవిత విశేషాలను తెలుగు పాఠకులకు అందించిన చరిత్రకారుడుగా ఖ్యాతిగాంచిన శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ తెలుగు సాహిత్యంలో అపూర్వం అనదగ్గ స్థాయిలో సాహిత్యకారుల, అనువాదకుల వ్యక్తిగత, సాహిత్య వివరాలను మన ముందుంచేందుకు చేసిన బృహత్‌ ప్రయత్నానికి హృదయ పూర్వక శుభాభినందానలు.