పుట:అక్షరశిల్పులు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ-522647, గుంటూరు జిల్లా, సంచారవాణి : 9440241727. 9396429700.

నా మాట

భారతస్వాతంత్య్రోద్యమ చరిత్రలో ముస్లింల పాత్రను వివరిస్తూ రాసిన గ్రంథాల గురించి 'ఎండి.సౌజన్య'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత ముహమ్మద్‌ నఫీజుద్దీన్‌ (తెనాలి) గారితో 2002 లో ప్రస్తావన వచ్చింది. అ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం కవులు-రచయితలు-అనువాదకుల వివరాలతో కూడిన ఒక గ్రంథాన్ని వెలువరిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఆయా కవులు-రచయితల సాహిత్యం, శైలి, వస్తువు తీరుతెన్నుల గురించి బాగా పరిచయం ఉంటే తప్ప ఆ ప్రయత్నానికి న్యాయం చేయలేనని భావించిన నేను అప్పట్లో నిస్సహాయత వ్యక్తంచేశాను.

                                                                    పునరాలోచన :

ఆ తరువాత 2004 అక్టోబర్‌ 9న భారత స్వాతంత్య్రోద్యంలో పాల్గొన్నముస్లిం యోధుల చిత్రపటాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి వెళ్ళాను. తెలుగు సాహిత్యరంగంలో 'స్మైల్‌' గా విఖ్యాతులైన ప్రముఖ కవి ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ గారి అతిథిగా ఆయన ఇంట రెండు రోజులున్నాను. ఆ సందర్భంగా తెలుగులో రాసిన, రాస్తున్న ముస్లిం కవులు-రచయితలు, అనువాదాకుల వివరాలను నమోదు చేసే ప్రాజెక్టును చేపట్టాల్సి అవసరాన్ని వివరిస్తూ ఆ ప్రయత్నం చేయమని ఆయన మరోమారు సూచించారు. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఆంధ్రాప్రదేశ్‌ ముస్లింల చరిత్రను గ్రంథస్థం చేసేందుకు సమాచారాన్నిసేకరిస్తున్న సందర్భంగా నేను చాలా ఇబ్బందులను, చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. ఆ అనుభవంతో రానున్న రోజులలో ముస్లిం కవులు-రచయితల సమాచారం కోసం శోధిస్తున్న పరిశోధకులకు, సాహితీవేత్తలకు, సాహిత్య చరిత్రకారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండ చూడలన్పించింది. కవులు -రచయితలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఒక్కచోట అందుబాటులో ఉంచితే తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేస్తున్నపరిశోధాకులకు మాత్రమే కాకుండ ఆసక్తిగల ఇతరులకు కూడ ఎంతోకొంత వెసులుబాటు లభించగలదని అన్పించింది.