పుట:అక్షరశిల్పులు.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఉపాధ్యాయులు. కర్నూలు ఉస్మానియా కళాశాలలో ఉద్యోగం. రచనలు: భక్త కల్పద్రుమ

శతకము, హరిహరనాధ శతకము, సుమాంజలి, లేఖా గుచ్చము, తెలుగుబాల (విద్యార్థుల నీతి బోధ), అనుగుబాల, మిత్రా (శతకము), చిన్నారి చెల్లెలు (జానపద నవల), మణి దీపిక (ఖండకావ్యము,1989), ఇల్లాలు(ఆధునిక నారీ సమాలోచనము),

శ్రీ మూర్తిరాజ శతకం, 1984), శ్రీ మిత్రా- తెలుగు బిడ్డ-శతకద్యయం (నీతి ప్రబోధకాలు), మణి మంజూష (ఖండ కావ్య సంపుటి), అనుమానం పెనుభూతం (నవల), స్త్రీ నైతిక శక్తి చలిస్తే (నవల), దంపతులు (మనో విశ్లేషణ, వచన కవిత, 1995), తాజాపూలు (వచనకవిత) సమదర్శనం (ఖండకావ్యం, 2002). వాడని పూలు (గేయ ఖండకృతి). రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు సారస్వత సంస్థలచే సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు పొందారు. 2002 నాటి చిరునామా: షేక్‌ మహమ్మద్‌ హుస్సేన్‌, దొరసానిపాడు -534426, వయా ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా.

ముహమ్మద్‌ ఖాశిం ఖాన్‌: కవితా సమితి సభ్యులు. శ్రీశ్రీ, పురిపండ అప్పల స్వామి, అబ్బూరివారి మిత్రులు. 1932లో 'భారతి' లో పారశీక వాజ్ఞ్మయ చరిత్రను మూడు భాగాలుగా రచించారు. రచనలు: వర్డ్సువర్తు కవిత్వం, మహమ్మద్‌ ఇక్బాల్‌, జలాలుద్దీన్‌ రుమి రాసిన మసన్నవీ, సూఫివేదాంతి హఫీజ్‌ అనువాదం. ఇవికాక జైనమత చరిత్ర కూడా రాశారు. ఆయన కలం నుండి పలు వ్యాసాలు, కవితలు జాలువారాయి.

ముహమ్మద్‌ రుస్తుంజీ షేక్‌: మెదక్‌ జిల్లా మిరుదొడ్డి మండలం ఆల్వాల్‌లో 1960 ఆగస్టు ఒకిటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ బీబిజాన్‌, షేక్‌ ఇబ్రహీం.'చిత్రకవి' బిరుదం.

మహమ్మద్‌ యార్‌: కర్నూలు జిల్లా యాళ్ళారులో 1911 జూలై ఒకిటిన జననం. తల్లితండ్రులు: ఇమాంబీ, మదార్‌ సాహెబ్‌. చదువు: ఎస్‌.ఎల్‌.సి. రచనలు: సోదర సూక్తులు, ఆవేదన తదితరాలు.

మొహిద్దీన్‌ బాచ్ఛా షేక్‌: గుంటూరు జిల్లా బ్రాహ్మణ

కోడూరులో 1936 నవంబర్‌ ఎనిమిదిన జననం. తల్లితండ్రులు: ఆషాబీ, గౌస్‌ సాహెబ్‌. చదాుదువు: ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి., ఉపాధ్యాయ శిక్షణ. వృత్తి: ఉపాధ్యాయులు. ప్రవృత్తి: యోగ శిక్షణ. 1994లో ఉద్యోగ విరమణ తరువాత సామాజిక-సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు అంకితం. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యోగా శిక్షణ కారక్రమాలనిర్వహణ. పత్రికలలో సామాజిక

108