పుట:అక్షరశిల్పులు.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

మైనార్టీ సంక్షేమ పథకాలు (అనువాదం, 2006), సచార్‌ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు (2007), ముస్లింల సమస్యలు (రంగనాధ్‌ మిశ్రా కమీషన్‌ సిఫారస్సులు, 2010), దళితముస్లింల ఐక్యతకు మిశ్రా కమీషన్‌ మార్గదర్శకాలు (2010). లక్ష్యం: ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు-బాధ్యతలు, చట్టాలకు సంబంధించిన విశేషాలు సామాన్య ప్రజానీకానికి తెలియపర్చడం తద్వారా ప్రజాచైతన్యం కోసం కృషి చేయడం. చిరునామా: మహమ్మద్‌ ఆరీజ్‌, ఇంటి నం.1-72/6 ఏ, రాఘవేంద్రకాలనీ, ఉప్పల్‌, హైదారాబాద్‌-500039. సంచారవాణి: 93913 34685.

ముహమ్మద్‌ ఉమరి అబూ అబ్దుల్లా: చిత్తూరు జిల్లా కలికిరి గ్రామంలో 1953 నవంబర్‌ నాల్గున జననం. తల్లితండ్రులు: బీబిజాన్‌, కె.బుడన్‌ సాహెబ్‌. చదువు: అఫ్జలుల్‌

ఉలమా., అదీబే ఫాజిల్‌., బి.ఏ., ఎం.ఏ., పిహెచ్‌.డి (జామియా

మిల్లియా ఇస్లామియా, న్యూఢిల్లీ, 2008). తెలుగు, ఉర్దూ, అరబిక్‌, పారశీకం, ఆంగ్లం, తమిళం, హిందీ భాషల్లో ప్రవేశం. వ్యాపకం: ధార్మికసేవ, రచన, ప్రసంగాలు. అరబిక్‌ నుండి ఉర్దూలోకి పలు గ్రంథాలను అనుదించారు. అరబిక్‌ నుండి తెలుగులోకి అనువదించిన గ్రంధాలు: 1. ఇస్లాంమూల సూత్రాలు, 2. ప్రవక్త నమాజ్‌ విధానం, 3. ఇస్లాం నుంచి మతం బహిష్కరణ విధానం, 4. మరణాంతర న్యాయ విచారణ, 5. ఖుర్‌ఆన్‌, హదీస్‌ల ఆధారంగా హజ్‌, ఉమ్రా, జియారత్‌ల విధానం. లక్ష్యం: అరబిక్‌, ఉర్దూల్లోని ఇస్లామియా ధార్మిక జ్ఞానాన్ని తెలుగు పాఠకులకు ఎరుకపర్చడం. చిరునామా: ముహ్మద్‌ ఉమరి అబు అబ్దుల్లాహ్‌, ఇంటి నం.8-2-316/ఎం/2, రోడ్‌నం.14, బంజార హిల్స్‌, హైదారాబాద్‌- 500034. సంచారవాణి: 98493 13744.

మహమ్మద్‌ ఆజం యస్‌.: కర్నూలు జిల్లా బేతంచర్ల జన్మస్థలం. పుట్టినతేది: 15-02-1928. తల్లితండ్రులు: గౌస్‌బీ, మహబూబ్‌. చదువు: బి.ఏ., బి.ఇ.డి. రచనలు: సూక్తి శతకము, కవితలు.

మహమ్మద్‌ గౌస్‌: కలం పేరు 'ఇబ్నెజాఫర్‌'. కడప జిల్లా ప్రొద్దుటూరు నివాసి. బహుళ ప్రచారం పొందిన 'ఆదర్శ మహాప్రవక్త' గ్రంథాన్ని రచించారు. చాలా కాలం 'ప్రబోధిని' మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఉర్దూ నుండి తెలుగులోకి పలు ధార్మిక గ్రంథాలను అనువదించారు.

మహమ్మద్‌ హుస్సేన్‌ షేక్‌: పశ్చిమగోదావరి జిల్లా దొరసానిపాడు. పుట్టిన తేది: 08- 08-1919. తల్లితండ్రులు: హుస్సేన్‌ బీ, సిలార్‌ సాహెబ్‌. చదువు: భాషాప్రవీణ, వృత్తి :

107