పుట:అక్షరశిల్పులు.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

వ్యాసాలతోపాటుగా చరిత్ర, యోగాకు సంబంధించిన వ్యాసాలు ప్రచురితం. రచనలు: 1.యోగాసనాలు, 2.బ్రాహ్మణ కోడూరు వైభవం, 3.తెనాలి శిల్పము. స్థానిక చరిత్రల గ్రంథాలలో 'బ్రహ్మణ కోడూరు వైభవం' గ్రంథానికి జాతీయ స్థాయి గుర్తింపు (2008). లభ్యం. అవార్డులు: జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (1985), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు (1999), చక్రపాణి-కొలసాని అవార్డు. లక్ష్యం: ప్రజోపకర సాహిత్యాన్ని, సమాచారాన్ని ప్రజల దృష్టికి తెచ్చుట, సామాజిక సేవకు ప్రజలను ప్రోత్సహించుట. చిరునామా: షేక్‌ మొహిద్దీన్‌ బాచ్ఛా, ఇంటి నం.2-16-17, లెనిన్‌ రోడ్‌, గాంధీనగర్‌, నందులపేట, తెనాలి, గుంటూరు జిల్లా.దూరవాణి: 08644- 226233, సంచారవాణి: 99893 68270.

మొహిద్దీన్‌ హుసైనీ సయ్యద్‌ షామ్‌
ఉర్దూ, అరబిక్‌, తెలుగు భాషల్లో ప్రవేశం. ఉర్దూ

నుండి పలు అనువాదాలు చేశారు. ప్రచురితమైన రచన : తౌహిద్‌ (అనువాదం)

మొహిద్దీన్‌ పిరాన్‌ ఏలూరు
కడప జిల్లా కమలాపురం. పుట్టిన తేది: 15-02-1927.

తల్లితండ్రులు: మహబూబ్‌బీ, హుస్సేన్‌మియా. అప్పటి నివాసం: కడపజిల్లా ప్రొద్దుటూరు తాలూకా మోడమీది పల్లె. రచనలు: ఇస్లాం జీవిత విధానము, ఆర్థిక సమస్య-ఆర్థిక పరిష్కారము, జమాయేత్‌ ఇస్లామీ సందేశము, నిర్యాణము-విచ్ఛిన్నము, కలిమ-ఏ-తయ్యబ అర్థము, ప్రపంచ మార్గదర్శి, ఇస్లాం శిక్షణ, ఖుత్బాత్‌ (హఖీఖతే ఇమాన్‌) ఖురాన్‌ (అలీఫ్‌- లాం-మీం) జిందగీ బాద్‌ మౌత్‌, లైలతుల్‌ ఖద్ర, మేరాజ్‌కిరాత్‌.

మొహిద్దీన్‌ సయ్యద్‌ కెే.
చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామంలో 1955 నవంబర్‌

తొమ్మిదిన జననం. తల్లితండ్రులు: జులేకా బీ, సయ్యద్‌ ఫకృద్దీన్‌. చదువు: బి.కాం., బి.ఎల్‌.

అక్షరశిల్పులు.pdf

వృత్తి : న్యాయవాది. 1980 నుండి కవితలు రాయడం ఆరంభం. 1981లో 'సాహిత్య నిధి' సాహిత్య మాసపత్రిక ప్రారంభించారు. ఈపత్రిక ఆధ్యర్యంలో పలుసాహిత్య-సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధతెలుగు పత్రికలలో పలు కవితలు, కథానికలు, సాహిత్య వ్యాసాలు ప్రచురితం. 1982లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' లో పాల్గొన్నారు. నటుడు, వక్త. రచన: తొలి వెలుగులు (కవితా సంపుటి, 1980). సాహిత్య-సాంస్కృతిక సంస్థల ఆధ్యర్యంలో సన్మానాలు పొందారు. లక్ష్యం: ఉత్తమ సాహిత్యాన్ని ప్రజలకు అందించడం. చిరునామా: కే. సయ్యద్‌ మొహిద్దీన్‌, న్యాయవాది, ఇంటి నం.3-60, పోలీసు లైను వీధి, పాతపేట, పలమనేరు-517408, చిత్తూరు జిల్లా. సంచారవాణి: 94413 92939.

109