పుట:అక్షరశిల్పులు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

పన్నుల శాఖలో సహాయ కమీషనర్‌ (చిత్తూరు). 1988లో 'ఉద్యోగ క్రాంతి' మాసపత్రికలో 'ప్రపంచీకరణ' వ్యాసం ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి వివిధ అంశాల మీద వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు ప్రచురితం. 1999లో రాసిన 'విదేశీ మోజులో స్వదేశీ విలవిల' వ్యాసం గుర్తింపు తెచ్చిపెట్టిటిెంది. మంచి వక్త. అవార్డులు: మదర్‌ థెరిస్సా అవార్డు (హైదారాబాద్‌, 2009), లక్ష్యం: సామాజిక ప్రయోజనం చేకూర్చగల రచనలు చేయడం. చిరునామా: టంగుటూరు మహబూబ్‌, ఫ్లాట్ నం. 301, రోహిత అపార్ట్‌మెంట్, రైల్వేగేటు రోడ్‌, వేదాయపాలెం, నెల్లూరు-4, సంచారవాణి: 99499 92516. Email: mahaboobt@rocketmail.com.

మహమూద్‌ పీర్ల షేక్‌
కడప జిల్లా ప్రొద్దుటూరులో 1971లో జననం. తల్లితండ్రులు:

హస్మత్‌బి, ఎస్‌.పి అహమ్మద్‌ హుసేన్‌. చదువు: బి.ఏ., బి.ఇడి. వృత్తి: వ్యాపారం. కలంపేరు: మహమూద్‌. 1994 నుండి రాస్తున్నా, 1998లో ఆహ్వానం పత్రికలో 'అగాధంలోకి' కవిత ప్రచురితం అయినప్పటి నుండి వివిధ పత్రికలలో, సంకలనాలలో పలు కవితలు, కథానికలు చోటు చేసుకున్నాయి. తొట్టతొలి కథ 'హజరా' విజయవిహారంలో ప్రచురితమైనప్పటి నుండి రాసిన కథలలో 'మిష్కిన్‌' (ఆంధ్రజ్యోతి), 'చార్‌బేయా' (అరుణ తార) గుర్తింపు తెచ్చి ప్టోయి. లక్ష్యం: మనం చూస్తున్న ప్రజల జీవితాల్నిఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరించడం. చిరునామా: షేక్‌ పీర్ల మహమూద్‌, ఇంటి నం.21/573, ఖాదర్‌ హుసేన్‌ మసీదు వీధి, ప్రొద్దుటూరు-516360, కడప జిల్లా. సంచారవాణి: 934722 5279, 08564-255561.

మహమూద్‌ షేక్‌
గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1937లో జననం. తలితండ్రులు:

షేక్‌ జహెరాబీ, షేక్‌ ఖాజా సాహెబ్‌. వృత్తి: జర్నలిజం. 1960లో

'బాలజ్యోతి' బాలల లిఖిత పత్రికను ఆరంభించినప్పటినుండి రచనా వ్యాసంగం ఆరంభం. ఆ తరువాత 'ఆదర్శం', 'ప్రగతి' లిఖిత పత్రికలను ప్రారంభించి పలు రచనలు చేశారు, పలువురు కవులు-రచయితలను ప్రోత్సహించారు. రచనలు: చైతన్యం (సాంఫిుక నాటిక, 1975), రాణి సంయుక్త (చారిత్రక నాటిక, 1979). 1975 నుంచి 'సత్యజ్యోతి' మాసపత్రికను నిర్విఘ్నంగా

99