పుట:అక్షరశిల్పులు.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మైత్రేయ కళాసమితి అవార్డు (2003), మహకవి ఎర్రన సాహితీ పురస్కారం (ఒంగోలు, 2009). బిరుదులు: కవిమిత్ర, కవితా భారతి. లక్ష్యం: మనస్సును పట్టే మంచి సాహిత్య సృస్టి . చిరునామా: షేక్‌ మహబూబ్‌ జాన్‌ , ఇంటి నం.19-3-13, కోట వీధి , ఒంగోలు-523001, ప్రకాశం జిల్లా. సంచారవాణి: 99599 50191, 08592-238580.

మహబూబ్‌ మియా
కడప జిల్లా ప్ద్దుటూరు నివాసి. పలు కవితలు, గేయాలు

రాశారు. 'నీతి సుధానిధి' గ్రంథాన్ని కసిరెడ్డి సుబ్బారెడ్డి, భూతపురి నారాయణ స్వామిలతో కలసి రాశారు. ఈ ముగ్గురు కవిత్రయంగా సుప్రసిద్దులు.

మహమూద్‌ పాషా
1982 నాటి నివాసం: 1-1-51, మోచిగల్లి, సిద్దిపేట. చదువు:

బి.ఎ., 1982లో హైదారాబాద్‌లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' సందర్భంగా తెచ్చిన 'తెలుగు దివ్వెలు'లో 'వాస్తవిక చిత్రాలు' కవిత రాశారు.

మహబూబ్‌ సాహెబ్‌ షేక్‌
కర్నూలు జిల్లా పాములపాడు నివాసి. కలం పేరు: బాపు,

మధురకవి, వెలుగోడు. రచనలు: శ్రీశైలక్షేత్ర మహాత్యము, నల్లకలువ, శ్రీ లక్ష్మీనృసింహస్వామి మహాత్యము, శ్రీ వెంకటేశ్వర వైభవము. పలు కవితలు, వ్యాసాలు.

మహబూబ్‌ షేక్‌: ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో 1964 ఆగస్టు ఒకిటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ జైనబ్బీ, షేక్‌ ఖాజా. చదువు: ఐదవ తరగతి.

ఉద్యోగం: రెవిన్యూ శాఖ. ఉర్దూ, తెలుగు భాషల్లో ప్రవేశం. 2000లో 'పాపానికి పరిష్కృతి' వ్యాసం 'వార్త' దినపత్రికలో ప్రచురితం అయ్యింది. అప్పటి నుండి వివిధ తెలుగు పత్రికలలో పలు ధార్మిక వ్యాసాలు చోటుచేసుకున్నాయి. ధార్మిక ప్రసంగాలు చేస్తారు. రచనలు: నమాజ్‌ తరీఖా (2005). లక్ష్యం: ఇస్లాం సందేశ ప్రచారం. చిరునామా : షేక్‌ మహబూబ్‌, ఇంటి నం. 8-33, దమ్మపేట-507306, ఖమ్మంజిల్లా, సంచారవాణి: 99491 53576, 93905 58469, 80199 60296. Email: mahaboobnf@yahoo.co.in

మహబూబ్‌ యస్‌. యం
కడప జిల్లా జంగాలపల్లి. పుట్టిన తేది: 01-07-1924.

తల్లితండ్రులు: హుస్సేన్‌ బీ, మహబూబ్‌ సాహెబ్‌. చదువు: ఎం.ఏ. సికిందారాబాద్‌లోని మహబూబియా స్కూలులో తెలుగుపండితులుగా ఉద్యోగం. రచనలు: సమత, గేయకవితలు.

మహబూబ్‌ టంగుటూరి
కడప జిల్లా రాయచోి చోటితాలూకా మూసాపేటలో 1953

జూన్‌ ఒకటిన జననం. తల్లితండ్రులు:టి.కమాల్‌బీ, టి.హన్నూ సాహెబ్‌. కలంపేరు: టంగుటూరు. చదువు: ఎం.ఏ., ఎల్‌ఎల్‌.బి., విశారదా (హిందీ). ఉద్యోగం: రాష్ట్ర వాణిజ్య

98