పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తపస్సు

"సాగరుని సల్లాపమా అల
చందురుని యుల్లాసమా సిక
తాతలాల విలాసమా
ఆ పగిది బంధించు నీకనుపాప నెయ్యది తాపసీ?"

"కలదు నా పాలకుని కంటను
కడలి, కల దీ చందమామయు
అలల తలపై నాట్యమాడుదు
రచట దంపతు లెవ్వరో?

ఆట కలరును సాగరుండును
అలల సనుకూలముగ నడుపును,
దంపతులు నింపదు రతని రత
నంపు కాంతుల కాన్కలన్!

-----------

94 యెంకి పాటలు