పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



బాలభక్తులవలె, నిలింపుల
లీల, శంపాలతికయన, గో
పాలు దరహాసాంచలమువలె
నటన సలిపిరి చిటుకలో!

ఆటలాడెడు నా సురూపమె
కోటి గుణితంబయ్యె తృటిలో
పాలకుడు తనుమరచి పరవశులీల
కన్నులు మూయగన్!

సాగరుని సల్లాపమేలా
చందురుని యుల్లాసమేలా
సైకతంపు విలాసమేలా
లోకమిక నేలా?"


*

---------

యెంకి పాటలు 95