పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉయ్యాల

ఎంకి వూగెను కొమ్మ వుయ్యాలా! చంద్ర
వంక వూగెను బొమ్మవుయ్యాలా!

ఏటిపైకొమ్మనూ
యెల యెంకి అమరించె
నీట బొమ్మవుయాల
నెలవంక వెలయించె . . ఎంకి. . .

ఎంకి వన్నెలచీర
నెగిరె వెన్నెల పూలు
ఎండుటాకుల గొలుసు
వెండితీగలు చేరే ! ...ఎంకి...

సికపూలు, ముంగురులు
చిరుమువల మొలనూలు
ఒకచే సదరుకొనుచు
ఒయ్యారమే వూగె ! ...ఎంకి...

తీగల నడుమ నూగె
దీపమై, తిలకమై,
పీఠమై___ఎంకికి__కి
రీటమై, నెలవంక!
మున్నీటి యాజోడె
ఆనాటి కీనాడు ! ...ఎంకి...

-----------------

యెంకి పాటలు 93