పుట:Yaksha Prasnalu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయసూచిక.

శ్లోకసంఖ్య. ప్రశ్నలు. సమాధానములు.
1 ఆదిత్యునెదిపైగా ప్రేరేపించున్నది పరబ్రహ్మము
అతని సహాయులెవరు దేవతలు
అతనినస్తమింపజేయునదేది ధర్మము
దేనియందుంటున్నాడు సత్యమందు
3 దేనిచే శ్రోత్రియుడగును వేదమును చదువుటచే
దేనిచేత గొప్పతనమును పొందును తపస్సుచే
దేనిచేత సహాయవంతుడవును ధైర్యముచేత
దేనిచేత బుద్ధిమంతుడగును పెద్దలసేవచేత
5 బ్రాహ్మణులకు దేవత్వమేది బ్రహ్మచింత
వారికి సద్ధర్మమేది తపస్సు
వీరికి మనుష్య భావమేది మరణము
వీరికసద్ధర్మమేది నిందించుట
7 క్షత్రియులకు దేవత్వమేది విలువిద్య
వీరికి సద్ధర్మమెయ్యది యాగము
వీరికి మనుష్య భావమేది భయము
వీరికసద్ధర్మమేది రక్షించక విడుచుట
9 యజ్ఞసామమెట్టిది ప్రాణమువంటిది
యజ్ఞయజుస్సెట్టిది మనస్సువంటిది
యెది యజ్ఞమును వరించును ఋగ్వేదము
యజ్ఞము దేనినతిక్రమించదు ఋగ్వేదము