ఈ పుట ఆమోదించబడ్డది
విషయసూచిక.
| శ్లోకసంఖ్య. | ప్రశ్నలు. | సమాధానములు. |
|---|---|---|
| 1 | ఆదిత్యునెదిపైగా ప్రేరేపించున్నది | పరబ్రహ్మము |
| అతని సహాయులెవరు | దేవతలు | |
| అతనినస్తమింపజేయునదేది | ధర్మము | |
| దేనియందుంటున్నాడు | సత్యమందు | |
| 3 | దేనిచే శ్రోత్రియుడగును | వేదమును చదువుటచే |
| దేనిచేత గొప్పతనమును పొందును | తపస్సుచే | |
| దేనిచేత సహాయవంతుడవును | ధైర్యముచేత | |
| దేనిచేత బుద్ధిమంతుడగును | పెద్దలసేవచేత | |
| 5 | బ్రాహ్మణులకు దేవత్వమేది | బ్రహ్మచింత |
| వారికి సద్ధర్మమేది | తపస్సు | |
| వీరికి మనుష్య భావమేది | మరణము | |
| వీరికసద్ధర్మమేది | నిందించుట | |
| 7 | క్షత్రియులకు దేవత్వమేది | విలువిద్య |
| వీరికి సద్ధర్మమెయ్యది | యాగము | |
| వీరికి మనుష్య భావమేది | భయము | |
| వీరికసద్ధర్మమేది | రక్షించక విడుచుట | |
| 9 | యజ్ఞసామమెట్టిది | ప్రాణమువంటిది |
| యజ్ఞయజుస్సెట్టిది | మనస్సువంటిది | |
| యెది యజ్ఞమును వరించును | ఋగ్వేదము | |
| యజ్ఞము దేనినతిక్రమించదు | ఋగ్వేదము |