పుట:VrukshaSastramu.djvu/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

57

తటస్థించు చున్నది. దీనిని బట్టి ద్విదళ బీజకములను అసంయుక్త దళవంతములు, సంయుక్త దళ వంతములు, అస్పుట దళవంతములని మూడు వర్ణములగ విభజించు చున్నాము. అసంయుక్త దళవంతములగు, సంపెంగ బెండ పువ్వులలో ఆకర్షణ పత్రములు వృంతము నుండియే యున్నవి. జామ,గోరింట వువ్వులలో అవి పుష్ప కోశము నంటి యున్నవి. రేగు, నారింజ కుంకుడు వువ్వులలో ఒక పళ్ళెరము గలుగు చున్నది. ఇట్టి భేదములను బట్టి వర్ణములనుపవర్ణములుగ విభజింప వచ్చును. ఈ రీతినే వర్ణములను కుంటుంబములుగను, జాతులుగను జాతులను తెగలగును విభజించుచున్నారు. వాని భేదములను గురించి విస్తారముగ దెలుపుట కిచ్చోటసావకాశము లేదు. తంగేడు, నేల తంగేడు, నూతికసింత, సునాముఖియును నొక జాతిలోని వైనను ఒకదాని నొకటి ఎక్కువగా బోలి యున్నను వానిలో దారతమ్యము గలదు. తంగేడును సునాముఖి యను కొనము. ఆయా మొక్కలకు గల ప్రత్యేక లక్షణములను బట్టి జాతులను తెగలుగ విభజించి యున్నారు. ఇట్లే తెగలలో రకములు గూడ నుండుడు. మామిడియంతయు నొక తెగ యైనను, బంగినిపల్లి, నీలపిల్లి, జొన్నలరాసి, మొదలగు పలురకములు గలవు. ఇట్లు వృక్షముల పరస్పర సంబంధము తెలియజేయు విభాగము శాస్త్రీయమయిన నైసర్గిక విభజనము.