పుట:VrukshaSastramu.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

లో బువ్వులు, గింజలును లేవు. మిగిలిన వానిలో నున్నవి. కావున వృక్ష లోకమును బీజవంతములు, బీజ రహితములు అని రెండు వర్గములుగా విడదీయుదము. దేవ దారు, మదనమస్తు (వరగుణ వృక్షము) కొబ్బరి, మర్రి, మామిడి, అన్నియు బీజవంతములే గాని దేవదారు మదనమస్తు పువ్వులకును మిగిలిన వానికిని భేదము చాల గలదు. వానిలో రేకులు లేవు సరికదా, అండము బహిరంగముగానే యున్నది. విత్తు ఒక కాయ లోపల బుట్టుటలేదు. దీనిని బట్టి పుష్పవంతములను వివృత బీజవంతములు, సంవృత బీజవంతములు అని రెండు వంశములుగ విభజింతము. సంవృత బీజవంతములగు మామిడి, చింత, బిళ్ళగన్నేరు, కొబ్బరి , ఈత, వరి మొక్కలలోను భేదము గల్గు చున్నది. మొదటి మూడింటిలోను బీజదళములు రెండున్నవి. మిగిలిన వానిలో నిక్క్కొక్కటియే గలదు. (ఇది గాక ఇంకను భేదములు గలవు.) దీనిని బట్టి ద్విదళభీజకములనియు ఏకదళబీజకములనియు రెండు వంశములుగ వేరు పరుచవచ్చును. ద్విదళ బీజకములగు సంపెంగ, ప్రత్తి, గన్నేరు, జిల్లేదు, ఆముదము,పెంటంగ,మొదలగు వాని పుష్పములందును భేదము గలదు. మొదటి రెండింటి ఆకర్షణపత్రములు విడివిడిగానున్నవి. గన్నేరు, జిల్లేడులో గలిసియున్నవి. ఆముదము, పెంటంగ పువ్వులలో లేకుండుటయో, మిక్కిలి చిన్నవిగ నుండుటయో