పుట:VrukshaSastramu.djvu/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

503

జాశయములు రెండుతంతువులు గలియుచోట నేర్పడుచున్నవి. లేదా, కొన్ని తంతువులచివరల రెండుగదులేర్పడును. ఇవి పురుష తంతువులుగ నెన్న బడు చున్నవి. ఇవి చివర లావెక్కిన మరికొన్ని తంతువుల నావరించు కొని యుండ వానిలోని పదార్థమడ తంతువుల లోనికి జేరి, మిళితమగు మూల పదార్థము న్యూతేఅశయముగ ఏర్పడు చున్నది. ఈ న్యూతాశయమునుండి న్యూత బీజము లేర్పడి సిద్ధ భీజముల వలెనె బూజును వ్యాపింప జేయును. ఈ బీజము లెనిమిదియో అంతకు దక్కువయో ఒక్కొక సంచి వంటి వాని లోపన నుండుటచే వీనికీ పేరు కలిగెను. అట్లు రెండు తంతువుల యందలి పదార్థము ఒక దానిలో జేరగనే దాపున నున్న తంతువులు చుట్టు చేరి వాని నావరించుకొనును. ఇట్లావరించు కొనుట దాని సంరక్షణ కొరకే. కొన్ని టిలో స్యూత బీజములు బహిరంగముగానే యుండును. వాని ప్రక్కను మాత్రము కొన్ని గొడ్దు తంతువు లుండును. కొన్నిటిలో అట్లు గొడ్డుతంతువులుండవు.

ఒకొక్కప్పుడు రాగులు మొదలగునవి పంటకు సిద్ధముగా నున్నప్పుడు కంకులలో నుండి నల్లని గింజల వలె కొన్ని గనపడును చున్నవి. వానిని చల కాలము వరకును చెడి పోయన గింజలే యనుకొనిరి. తరువాత కొంత కాలమునకవియు బూజె