504
గుట గ్రహించిరి. ఈగింజలవంటివి చేను కోయునపుడు రాలి భూమిలో దాగి యుండును. వాని మీద నుండు నల్లని గట్టి పడిన తంతువులు సంరక్షించుచుండును. గావున అవి రెండు మూడు నెలల వరకు కూడ నట్లుండ గలవు. తరువాత వాని నుండి కొన్ని పలువలు బయలు దేరును. అవి రాలి డోలు వాయించు కర్రల వలెనుండును. వాని తలపైన పొక్కులు పొక్కుల వలె గొన్నిటిని జూడ వచ్చును. ఈ పొక్కులపైన రంద్రములు గలవు. దీనిని సూక్ష్మ దర్శిని క్రింద బెట్టి చూచినచో ఆ రంధ్రముల క్రింద సందుల వంటివి యున్నట్లు , దానిలో న్యూత వీజములున్నట్లు గాన వచ్చును. ఈ న్యూత బీజములు గాలి మూలముననో, పురుగుల మూలముననో బైటకు వచ్చి పుష్పముల కడుగున చేరి యచ్చట బూజుగ పెరుగును. ఈ బూజు పుష్ప భాగముల నావరించు కొనును. దీని నుండి సిద్ధ బీజాశయములు కూడ పుట్టును. మరియు నివి పుట్టినపుడు తేనె వంటి ద్రవముకూడ వీని నుండి స్రవించును. ఈగలు ఈ తేనెకు ఆశపడి దానిని గ్రోల రాగా వానినంటు కొని సిద్ధ బీజాశయములు వ్యాప్తి నొందు చున్నవి. అవి మరియొక పుష్పమును చేరగనే యచ్చట మరల బూజును బెంచుచున్నవి.
అట్లు క్రమక్రమముగ బూజు పుష్పమునందంతయు వ్యాపించి ధాన్యముపండ బోవునపుడె పైనల్లని గట్టి పొరనేర్పరుచు కొను చున్నవి.