పుట:VrukshaSastramu.djvu/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

476

ఆద్రవము నుండి నీరు పోయి పంచదార మిగులుటకు దానిని పెనుమలలో పోసి కాతురు. పంచదార పలుకులు పెద్దవిగా నుండుట చిన్నవిగా నుండుట ఈ కాచిన పద్ధతిని బట్టి యుండును. తరువాత దాని రంగును పోగొట్టి తడి లేకుండ చేసి శుభ్ర పరచుదురు.

పంచదార వండగ మిగిలిన పదార్థముల నుండి రమ్ము, బీరు సారాయిలను చేయుదురు. చెరుకు పిప్పితో కాగితములు చేయ వచ్చును గాని దీనిని యంత్ర శాలల వద్దకు కొనిపోవుటయు చెరుకు గానుగల వద్దకు పంట చెరుకు దెచ్చుటయు చాల ప్రయాస మగును.

ప్రపంచములో కొన్ని దేశములు బెల్లము నెరుగక మునుపే మనము బెల్లపు వర్తకము నారంబించితిమి. కాని ఇప్పుడు ఐరోపా దేశస్తులు యంత్ర సహాయమున చౌకగా చేయుట నేర్చు కొనుట చేతను, ఒక దుంప నుండి చౌకగ పంచ దార చేయుట చేతను మన వర్తకము తగ్గి పోయినది. మనమే ఇప్పుడు పంచ దార నన్ని దేశములనుండి తెప్పించుకొను చున్నాము. 1902 సంవత్సరము వరకు అన్య దేశపు పంచ దార పైన పన్ను గలదు కాని దాన్నిప్పుడు కొట్టివేసిరి. చెరుకుగడలు పుష్పించి కాయలు గాయుట కూడ గలదు. వాని పుష్పములకు