పుట:VrukshaSastramu.djvu/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

477

వేరువేరు తెగల పుప్పొడిని సమావేశము చేసినచో రకరకముల చెరుకు గడలు వచ్చును. కొన్ని చోట్ల అట్లును చేయు చున్నారు.

మన దేశమునందును బర్మా దేశమునందూ గలసి 88800 ఎకరములు చెరుకు పండు చున్నది. పంచదార చేయుటకు 24 యంత్ర శాలలు గలవు. వీనిలో 19 బంగాళాదేశము లోనె గలవు. మంచి చెరుకును నాటుచు యంత్ర శాలల నెక్కువ చేసిన యెడల అన్యదేశముల నుండి వచ్చుట తగ్గును.

చెరకు గెడల తినుటకు చాల బాగుండును. చెరుకులన్న ఏనుగులకు ప్రీతిమెండు.

వెదురు కొండల మీదను అడవుల లోని విరివిగానే పెరుగు చున్నది. వెదురు మొక్కలు గుబురుగా మొలచి అందముగా నుండుట చేత వానిని తోటలందును బెంచుచున్నారు. వెదురు గింజలు చెట్టున నుండగనే మొక్కలు మొలవ నారంబించును. లేత మొక్క అరంగుళముల పొడుగుగా నున్నప్పుడు క్రింద పడీ, నాటుకొని వేళ్ళు బారును. ఇవి పెద్దవగుటకు భూమి సారమును బట్టి పది మొదలు ముప్పది సంవత్సర