పుట:VrukshaSastramu.djvu/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

తులసి మొదలగు పువ్వులలో దళవలయము సరిగా లేదు. ఆసరాళముగ నున్నది. గుండ్రముగా నుండక కొంచము వంకరగా నున్నది. చిక్కుడు పువ్వు ఒకవిధమగు సీతాకోక చిలుక వలెనున్నది. దీనిలో ఒక రేకు పెద్దదిగా జండావలె నున్నది. దీనికే పతాక దళమని పేరు. దీని ప్రక్కను రెండు రెక్కలవలె గలవు. అవి పక్షదళములు. ఇంకొక రెండు రేకులు గలిసి

బొమ్మ
(బఠాణిపువ్వు) బఠాణి పువ్వు విడదీసిన రేకులు, పెద్దది పతాక దళము, ప్ర్క్కనున్నవి పక్ష దళములు.)

చుక్కాను వలె నేర్పడినవి. అవి ద్రోణీదళములు. తులసి అడ్డసరము పువ్వులు ఓష్టాకారముగ నున్నవి.

దానిమ్మ మొదలగు కొన్ని పువ్వులందు దళ వలయౌ పుష్పకోశము నండి యున్నది. దళవలయము తరువాత