పుట:VrukshaSastramu.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37

కింజల్కములు గలవు. కింజల్కములే పురుషాంగములు. వీనిలో రెండు ముఖ్య మైన భాగములున్నవి. ఒకటి కాడ, రెండు పుప్పొడితిత్తులు. ఈ పుప్పొడి తిత్తులలో రెండు గదులుండును. కాడని పుప్పొడి తిత్తులను గలుపు నొక సన్నని కాడకు సంయోజక మని పేరు. సాధారణముగా ఒక్కొక్క కాడ రెండు ఆకర్షణ పత్రములకు మధ్యగా నుండును. కాని రేగు పువ్వులోను మరి కొన్నింటిలో కింజల్కములు అకర్షణ పత్రముల కెదురుగనే యున్నవి.

కుంకుడు, నారింజ, మొదలగు వాని యందు కింజల్కముల మధ్యనో, వాని చుట్టునో ఒక పళ్ళెము గలదు. ఇది వృంతము యొక్క భాగమే.

కింజల్కములు కొన్నింటిలో పుష్ప కోశమును, కొన్ని టిలో దశవలయమును, కొన్నిటిలో అండాశయమును గూడ అంటుకొని యుండుచున్నవి. కింజల్కములు, అండ కోశము, స్త్రీ పురుషాంగములు గనుక నవి రెండును ఉన్న పుష్పములను మిధున పుష్పములందుము. వీనిలోనేదైన ఒకటియే యుండిన నది ఏక లింగ పుష్పము. తాటి చెట్లలో వలె ఏకలింగ పుష్పములు వేరు వేరు చెట్ల మీద నున్నయెడల నవి ఏక లింగ వృక్షములందుము.

పుష్ప భాహము లన్నిటిలో అండ కోశమే చివర బయలు దేరుచున్నది. చిక్కుడు., చింత పువ్వులందు అండ కోశము ఒక