పుట:VrukshaSastramu.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనినట్లు మెలి వేసి కొనియున్నవి. మందార పువ్వులో కొన్ని ఆకర్షణ పత్రములు లోపలగా నున్నవి. వానిని గప్పుచు కొన్ని యున్నవి. కొన్ని ఒకదాని నొకటి తాకుచు మాత్ర ముండును. కొన్నిటిలో తాకకుండను నుండుట గలదు. గంగ రావి రేకులు మెలివెట్టికొని యున్నవందుము. మందారపు రేకులు అల్లుకొని యున్నవి. మిగిలినవి తాకుచునో విడివిడిగానో ఉన్నవందుము. తురాయి పువ్వులో ఆకర్షణ పత్రములు పెద్దవియే. కాని వాని మొదట లాచ సన్నముగనున్నది. అది కాడవలే నున్నది. దానిని పాదమందుము. దళ వలయము సంయుక్తమై ప్రొద్దు తిరుగుడు పువ్వులో మధ్యనున్న పువ్వుల వలె గొట్టము వలెనైనను చిలగడ దుంప పువ్వుల వలె గరాట వలెనైనను వంగ, మిరప వువ్వులవలె నక్షత్రాకరముగ నైనను బిళ్ళ గన్నేరు పువ్వులలో వలె ఛత్రాకారముగ నైనను నాగసరపు కాయల వలె నైనను, గంట వలెనైనను నుండును. చిక్కుడు

బొమ్మ
(అడ్డసరము. పుష్పము)