పుట:VrukshaSastramu.djvu/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

పురుష పుష్పములు

పుష్పకోశము.- అసంయుక్తము. రక్షకపత్రములు 3 మూడు ఒకదానికొకటి తాకుచు నుండును. మిక్కిలి బిరుసుగ, చర్మము వలె నుండును. నీచము.

దళవలయము
- అసంయుక్తము. ఆకర్షణ పత్రములు 3. వీనికి, మంచి రంగు గాని, వాఅన గాని లేదు. మిక్కిలి బిరుసుగా నుండును.
కింజల్కములు
6....3 దళ వలయమున గదుగదురుగను, 3 పుష్ప కోశమున కెదురుగ నుండును. పుప్పొడి తిత్తులు సన్నము.
పుష్ప కోశము
- గొడ్డు దై యున్నది.
స్త్రీ పుష్పములు
- పురుహ పుష్పముల కంటె పెద్దవి.
పుష్ప కోశము; దళవలయము పై దాని యందు వలెనే యుండును. కింజల్కములు లేవు.
అండ కోశము
-. అండాసయము ఉచ్చము. 3 గదులు. కాని ఒక గదియే పెద్దదగును. కాయలో నున్న తెల్లని కొబ్బరి విత్తనము పెరుగుటకు నిలువ చేసికొనిన పదార్థము. కొబ్బెరపీచు లోపల నుండు పెంకు కూడ కాయ లోని భాగము కాని గింజ కాదు. ఒలచిన కొబ్బరికాయ కొకవైపున మూడు రంద్రములున్నట్లు కనబడును. ఒక దాని ద్వార సులభముగ పొడవ వచ్చును గాని, మిగిలిన రెండును మూసికొని వుండును. ఈ రంద్రముల ద్వారా కాయ పెరుగుటకు ఆహార పదార్థమ్లు వచ్చినవి. లేత పొందెలో నున్న మూడు గదులలోను రెండు గదులు పెరుగక పోవుటచే రెండు రంద్రములు మూసికొని పోయినవి.

తాడి చెట్టు,- సముద్రమునకు దూరముగ పెరుగ గలదు.