433
కొబ్బరి కుటుంబము.
కొబ్బరి చెట్టు అన్ని ఉష్టదేశములందును సముద్రము చేరువ పెరుగు చున్నది.
ప్రకాండము 80 అడుగుల యెత్తు వరకును పెరుగును కాని కొమ్మలుండవు. పైబెరడు దట్టముగాను, బిరుసుగాను, పగుళ్ళు, పగుళ్ళుగా నుండును. దీనిపై రాలిపోయిన ఆకుల యానవాళ్ళు గలవు. ప్రకాండము మొదట కొంచెమెక్కువ లావుగా నుండును. గాని, అటుపైన చివర వరకు నొక్కటియే లావు. మామిడి, మర్రి, మొదలగు ద్విదళ బీసకపు వృక్షముల వలె నిది పొడుగగుచుండినను లావుకాలేదు.
ప్రకాండమున కడుగున చాల వేళ్ళు గలవు. ఇవి కొంచెమెర్రగను చిటికిన వ్రేలు లావునను నుండును. ఈ ఉపవంశపు చెట్లు తల్లి వేరు చిన్నదిగ నున్నప్పుడే చచ్చి పోవుట చేత, ప్రకాండమడుగున నుండి ఇన్ని వేళ్ళు పుట్టు చున్నవి.
ఆకులు చెట్టు చివర దగ్గరి దగ్గరిగా నుండును. ఇవి మిక్కిలి పెద్దవి. మిశ్రమ పత్రములు. పక్ష వైఖరి. చిట్టి ఆకులు పొడుగుగానే యుండును. సమరేఖ పత్రము. సమాంచలము. దట్టముగను బిరుసుగను నుండును.
పుష్ప మంజరి రెమ్మకంకి, లేత రెమ్మకంకులను గప్పుచు బిరుసుగ ఊరుచేటిక గలదు. పువ్వులు చిన్నవి. సరాళము. ఏకలింగపుష్పములు.