పుట:VrukshaSastramu.djvu/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

407

అంగుళముల వెడల్పున నిలువున జీల్చెదరు. ఆ చీలికలను నొకనున్నని బల్లకును నొక కత్తికిని మధ్య బెట్టి లాగెదరు. అట్లు లాగుట వలన నా చీలికలలోని నీరు మెత్తని పదార్థమును పోయి నార మాత్రము మిగులును. దీనినే ఎండ బెట్టెదరు. ఈ నారతో జాలకాలమునుండి పగ్గములు, కాగితములు చాపలు చేయుచున్నారు గాని ఈమధ్యబట్టలుకూడ నేయు చున్నారు.

లేత ఆకులు కాలి పుండ్లు పడిన చోట వేయుచో బాధ తగ్గును. అరటి వేరు, ప్రకాండమును రక్త సంబంధము లగు కొన్ని జబ్బులకు మంచివి.

కచ్చూరము మొక్క ఒక బంగాళా దేశమునందే కాక చీనా మొదలాగు నేషియా ఖండమందలి ఇతర దేశములలో కూడ బెరుగు చున్నది. అది వేసవి కాలమందు పుష్పించును. దీని వేళ్లను ముక్కలుగా కోసి ఎండ బెట్టుదురు. ఇవియే గచ్చూరములు. వీనికి మంచి పరిమెళము గలదు. వీనిని పొడుము చేసి పచ్చాకుతో గలపి కొబ్బరి నూనెలో వేయుదురు.

పసుపు మొక్కలను తరచుగా వంగ, కంద మొదలగు నితర పైరులతో గాని విడిగా గాని వేయుదురు. పొలము