పుట:VrukshaSastramu.djvu/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

403

అండకోశము
- అండాశయము 3 గదులు నీచము కాయ బహు విదారుణ ఫలము. కీలము ప్ల్చగాను కీలాగ్రము వెడల్పుగాను నున్నది.
కచ్చూరము.

కచ్చూరము మొక్క హిందూ దేశములో కెల్ల బంగాళ దేశమ్ందెక్కువగా గలదు.

ప్రకాండము
- సశునము. భూమి మీద నిజమైన ప్రకాండము లేదు.
ఆకులు
- లఘుపత్రము కణుపు పుచ్ఛములు లేవు. తొడిమ గలదు బల్లెపాకారము సమాంచలము సమ రేఖ పత్రము క్రింది వైపున బిరుసుగా నున్న రోమములు గలవు. కొన సస్న్నము వేసవి కాలమందు ఆకులెండి రాలి పోవును.
పుష్పమంజరి. కంకి. వేసవికాలమందాకు లెండి పోయినప్పుడు బయలు వెడలును. గులాబి రంగు.
పుష్ప కోశము
సంయుక్తము. 8 దంతములు గలలవు. ఉచ్చము.
దళవలయము. అడుగున గొట్టము వలె నున్నది. కంఠము లావుగా నుండును. ఆకర్షణ పత్రములును, ఆకర్షణ పత్రములుగా మారిని కింజల్కములును గలసి వెడల్పుగు రెండంచుల గరాటి వలే నైనవి. దీని పై అంచులో నిడివి చౌకముగ నున్న నెర్రని తమ్మెలు 3ను ఆకర్షణ పత్రములు.
కింజల్కములు
అగరాటి యొక్క పసుపుపచ్చగా నున్న 8 తమ్మెలు కింజల్కములు వీనిలో లోపలగా నున్న అతమ్మె యెక్కువపొడగుగాను నున్నది. పైనవున్న రెండు తమ్మెలకు మధ్య కింజల్కపు కాడ కలదు. పుప్పొడి తిత్తికి రెండు గదులున్నవి. గదులక్రింద నుండి చిన్నవాలములు గలవు.