ఈ పుట ఆమోదించబడ్డది
402
- అండకోశము
- అండాశయము నీచము. 3 గదులు కండ కాయ. అడవి కాయలందు దప్ప గింజలు లేవు. కీలము సన్నము. అడుగున రోమములతో గూడి లావుగ నున్నది. కీలాగ్రము చీలి 6 తమ్మెలుగ నున్నది.
- మెట్ట్ తామర
మెట్ట తామర హిందూ దేశమునందంతటను పెరుగు చున్నది.
- ప్రకాండము
- మూలవహము.
- ఆకులు
- లఘుపత్రము ఒంటరిచేరిక అండాకారము కణుపు పుచ్చములు లేవు సమ రేధ పత్ర్ము రెండు వైపుల నున్నగా నుండును కొన సస్న్నము.
- పుష్ప మంజరి
- కంకి. కంకిమీద అంగుళము అంగుళ దూరమున రెండేసి పువ్వులు గలవు వీని దగ్గర మూడేసి చేటికలు గలవు.
- పుష్ప కోశము
- 3 రక్షక పత్రములు ఉచ్చము. ఎండి పోయినను కాన నంటి పెట్టుకొని యుండును.
- దళ వలయము. ఆకర్షణ పత్రములు 3. రక్షక పత్రముల కంటె పెద్దవి గాను ఎక్కువ రంగుగాను నున్నవి. ఎర్రని రేకులన్నియు ఆకర్షణ పత్రములు గావు.
- కింజల్కములు
- దళవలయములోపల ఆకర్షణ పత్రములవంటివి నాలుగైదు కలవు. ఇవియే పుష్పమున కందముదెచ్చుచున్నవి. వీనిలో నన్నిటి కంటెను లోపలగా నున్న దానిమీద మధ్యగానొక పుప్పొడిచిత్తి గలదు. దీనిలో ఒక గది మాత్రమే కలదు. మిగిలిన కింజల్కములు గొడ్డులై ఆకర్షణ పత్రముల వలె మారినవి.