పుట:VrukshaSastramu.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

గన్నేరు మొక్కలో వలె మూడుగాని, అంతకంటె ఎక్కువ గాని యున్నచో కిరణ ప్రసార మందుము. ఆకులందు తొడిమ పత్రము పాదపీఠము అను మూడు భాగలులు గలవని ఇది వరకే జీవ శాస్త్రమునందు జదివియున్నారు. తొడిమ బొప్పాయి, గంగ రావి మొదలగు కొన్నింటిలో బొడుగుగా నుండును. పొన్న, రేగు మొదలగు కొన్నింటిలో పొట్టిగా నుండును.

బొమ్మ. (బఠాణి ఆకు చివర నులి తీగ వలె మారి యున్నది. కణుపు వుచ్ఛములు పెద్దవై పత్రము చేయు పనిని చేయుచున్నవి.)

నేల ఉసిరి ఆకులకును వాయింట యొక్క చిట్టి యాకులకును తొడిమ లేనేలేదు. తొడిమ నంటుకొని దాని కిరుప్రక్కల కణుపు వద్ద చిన్న రేకల వంటివి కొన్నిటిలో నుండును. ఉదా: గులాబి వానికి కణుపు పుచ్చములని పేరు. ఇవి ఆకులు మిక్కిలి చిన్నవి గా నున్నప్పుడు కణుపు సందు లందు మొలచెడు మొగ్గలకు నెండ దగులనీయ కుండ కాపాడు చుండును. రేగు చెట్లలోనివి ముండ్లుగా మారి యున్నవి. తొగరు చెట్లలో రెండాకులకును మధ్యగా