పుట:VrukshaSastramu.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12


స్థించు చున్నది. గనుక, కొమ్మలు ఆకు పచ్చగను, వెడల్పుగ నుండి ఆకుల పనిని కూడ జేసికొను చున్నవి.

ఆకులు.

ఆకులు వృక్షములకు ముఖ్యమైన యంగములు. వీనిలోనె, వేరుల మూలమున భూమిలో నుండి వచ్చిన పదార్థములును, గాలిలో నుండి ఆకులు సంపాదించిన పదార్థమును మిళితమై, ఆహారమై,జీవ పదార్థముగ మారుచున్నది.

ఆకులు కొమ్మమీద పుట్టు చోటునకు కణుపని పేరు. ఒక్కొక్క కణుపు వద్ద ఒకటో రెండో, అంతకంటె నెక్కువయో ఆకులుండును. ఒక్కొక్కటి యున్న యెడల ఆ ఏర్పాటును ఒంటరి చేరిక అందుము. ఉదాహరణ:... రామాఫలపు ఆకులు: (దీనికే జీవ శాస్త్రమునందు సర్ప ప్రసారమని యున్నది.)

బొమ్మ
,x,x,x,

రెండేసి యున్న యెడల, అరెండును ఒక దానికొకటి ఎదురుగా నుండును కాబట్టి అభిముఖ చేరి యందుము. ఉదా: బిళ్ళ గన్నేరు, లవంగము.