పుట:VrukshaSastramu.djvu/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెరుగును. వానిని గిజలు నాటిగాని, కొమ్మలు నాటి గాని పెంచ వచ్చును. గింజలు మిక్కిలి గట్టిగా నుండుట చే ద్వరగ మొలకెత్తవు గావున వానిని నాటుటకు ముందొక రాత్రి పేడ నీళ్ళలో నాన వేసెదరు. మొక్కలు కొంచెమెత్తెదిగిన పిమ్మట దూర దూరముగ బాతుట మంచిది. అవి మూడవ యేటనే పుష్పించి కాయలు గాయును. కాని దాని బెరడు మాత్ర మైదారు సంవత్సరముల వరకు దోళ్ళు బాగు చేయటకు బనికి రాదు. ముదురు చెట్ల బెరడు బాగుగనే యుండును కాని లేత వాని బెరడుతో జర్మములకు మంచి రంగు వచ్చును. చెట్ల మీద నెచ్చట నైన నాటు పెట్టినచో జిగురు వచ్చును. ఇది ముదురు చెట్టు నుండి చాల వచ్చును గాని లేత వాని జిగురు మంచి దందురు. ఈ జిగురును వెల్లవేయుట యందును, చిత్ర పటములు గీయుట యందును, ఔషధముల యందును కూడ నుపయోగింతురు. లేతతుమ్మ కాయలు ఆకులు, మేకలకును, పశువులకును వేసినచో నవెక్కువపాలిచ్చును. తుమ్మకలప గట్టిగా నుండును గాని ఇండ్లకు శుభ ప్రదము గాదని మానుదురు. కాని కొన్నిచోట్ల వాసములగను, దూలములగను వాడుచున్నారు. ఇది బండ్లు, నాగళ్ళు మొదలగునవి చేయుటకు బాగుండును. మరియు నీళ్ళలో నాననిచ్చిన యెడల చక్కగ వంగుచు సన్నపుపనులకు బనికి వచ్చును. ఇదిమం