పుట:VrukshaSastramu.djvu/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చి వంటచెరకు. పేళ్ళు నిలిచికాలును. వీనివేడిమి ఎక్కువ. కావున యంత్ర శాలలయందు కూడ నుపయోగించెదరు. వీని నీడ యంతగా నుండదు. అయినను వానిక్రింద గడ్డి తెప్ప ఇతర మొక్కలు మొలవవు. కాని గడ్డి మాత్రము ఏపుగా బెరుగును. అందు చేతనే బీడుల యందును పచ్చిక యళ్ళ యందును నీ చెట్లను నాటుదురు.

తెల్లతమ్మ:- ఇట్లే యుండును. దీనినుండియు జిగురు తీయుదురు. నారయు వలలకు బనికివచ్చును.

కస్తూరితుమ్మ:- పువ్వుల కాడలు పొడుగుగా నుండును. వీని పువ్వులే మిక్కిలి యుపయోగమైనవి. ఇవిపరిమళముగ నుండుట చే సువాసన నూనెలందు వాడుదురు.

ఖదిర వృక్షము కూడ తుమ్మ చెట్లవలెనే యుండును. దీని పువ్వులలో ప్రత్యేకముగ కొన్నిపురుష, పుష్పములే గలవు. ఈ చెట్టు నుండియె మనము తాంబూలములో వేసికొని కవిరి (కాచు) చేయుచున్నారు.

చెట్లను నరికి మ్రాను మధ్య నుండు భాగమూ పలుచని చిన్న చిన్న ముక్కలుగ గోసి పెద్ద కాగులులో వేసి మరగ పెట్టుదురు. మరిగి రసము చిక్కబడిన తరువాత నొక బల్ల మీద నాకులు పరచి వీనిపై రసమును చల్లార బోసెదరు.