పుట:VrukshaSastramu.djvu/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జమైకాదేశములో చింత పండును పంచదారయు నొక దాని తరువాత నొకటి వేసి, పైన పంచ దార పాకము పోసి పీపాలలో బిగించి ఎగిమతి చేయుచున్నారు. చింత మ్రాను మిక్కిలి బలమైనదైనను సన్నపు పనులకు బనికి రాదు. దీనితో గానుగలు, బండి చక్రములు మొదలగునవి చేయుటకు బాగుగ నుండును. చింత పేడుమంచివంటచెరకు, తుమ్మ పేదు వలెనే మండును.

సీమచింత:- మొక్కలు చిన్నవిగా నున్నప్పుడు తోట చుట్టు కంచెలుగా బాతుదురు. దీని లేత కొమ్మలమీద నెర్రని చారలుండును. ఆకులతొడిమల వద్ద ముండ్లు గలవు (ఖణుపు పుచ్చములే ముండ్లు గా మారినవి) వెల చెట్టులో వలె దీని మీదను నొక్కొక్క చోట నుండి చాల యాకులు వచ్చును. అచ్చట పుట్టవలసిన కొమ్మ పుట్టక కొమ్మ మీద నుండ వలసిన యాకులు మాత్రము పెరిగి వచ్చు చున్నవి. ఈ చెట్లు ఉపయోగము అంతగా లేదు. వీని గింజలపై నుండు నెర్రని పదార్థము కొందరు తిందురు.

నల్లతుమ్మ:- చెట్లు పెక్కుబయళ్ళయందు బెరుగుచున్నవి. వీనికంతగా నీరక్కర లేదు. సాధారణముగ నివి పొట్టిగా నుండునుగాని సారవంతములైన చోట్ల ఎత్తుగా