పుట:VrukshaSastramu.djvu/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొకబండ మీద పెట్టి కర్రలతో గొట్టుదురు. వచ్చిన నారను నీళ్ళమీద కొట్టుట చే నార శుబ్రమగును. ఇక నీళ్ళు బోవుటకు నారను మెలిపెట్టి యెండలో బెట్టుదురు. నార మంచి తనము, చెడ్డతనము, అదెన్ని నాళ్ళు నానునో దానిని బట్టియు, ఎంత చక్కగ శుభ్రము చేయ బడినదో దానిని బట్టియు నుండును. ఈ నారయు నితర నారలవలె బనికి వచ్చును. దీనొతో త్రాళ్ళు, పగ్గములు, కేన్వాసును చేయుదురు. కాని మన దేశములో విస్తారము వలలకే నుప యోగించుచున్నారు. ఇవన్నియు చేయగ మిగిలిన తుక్కు కాగితములు చేయుటకు అనుకూలముగ నుండును

చింతచెట్టు:- మనదేశములో బెరుగు మహా వృక్షములలో నొకటి. ఇది మన కష్టము లేకయే మన్యములలోను, దొడ్లయందును బెరుగు చున్నది. మొక్కలను నాటి పెంప వలెనన్న మూడడుగుల లోతునను మూడడుగుల వెడల్పునను గోతులు దీసి, వాని నిండ ఎరువు వేసి, 3, 4., గింజలను నాట వలెను. మొక్కలు కొంచమెత్తు మొలచిన తరువాత వానిచుట్టు పశువులు తినకుండ కంచ కట్టవలెను. చింత చెట్టు మిక్కిలి యుపయోగ మైన వృక్షము. చింత చిగురు నొక్కొక్కప్పుడు మందులలో గూడ వాడుటకలదు.