పుట:VrukshaSastramu.djvu/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుల మీద వెండి వలె మెరయు రోమములు గలవు. వీనిగింజలు చిక్కుడుగింజల వలె నుండును.

జనుము పొలములకు మిక్కిలి బలమగు నెరువు గావునను పశువులకు మంచి ఆహారము గావునను దీనిని సేద్యము చేయు చున్నారు. దీని కంతగా సారవంతమైన నేల అక్కరలేదు. ఎరువు కొరకైనచో రెండునెలలు మొలచిన పిదప గోసి దానితో దమ్ము చేయ వచ్చును. మరియు నీ గింజలను ఒత్తుగా చల్లిన మాత్రముననే పొలములో గట్టి మొక్కలను మొలవనీయదు.

మనవైపుల జనుము నంతగా నారకొరకు సేద్యము చేయుట లేదు గాని ఇప్పడి పుడెక్కువయగుచున్నది. నారకు పల్లపు భూములలో మొలచిన జనుము కంటె కొంచెము మెరక నేలలలోనిది మంచిది. కాయలగాచుచుండగనే దానిని గోసి చిన్న చిన్న కట్టలుగట్టుదురు.

ఆకులను రాల్చి చిన్న కట్టలన్నియు బెడ్డవానిగ కట్టి ఎండబెట్టి ఎందినపిదప నీళ్ళలో నూరవేయుదురు. ప్రవహించుచున్న నీళ్ళలో నాన వేసిన మంచి దందురు గాని అట్లయినచొ చాల కాలము గావలయును. నానినదానిని దీసి