Jump to content

పుట:VrukshaSastramu.djvu/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేలు రంగును శుభ్రమగు నీళ్ళతో కలిపి కాచి కషాయమును వడగట్టి బోగొట్టి రంగు నెండ బెట్టుదురు.

వేరువేరు పదార్థముల నుండి రంగు చేయుచుండి నప్పటి నుండియు మన దేశపు వర్తకము తగ్గి పోయెను. తగ్గినను సంతోషమే కాని, పంట పండించి పై దేశముల కెగుమతి చేసిన మనము గూడ నితర దేశముల నుండి దిగుమతి కూడ చేసి కొనుచున్నాము.

కరినీలి:- మూడడుగులు పెరుగుచున్న మొక్క. ఆకుల మీదను కొమ్మల మీదను తెల్లని రోమములు గలవు. ఆకులు చల్లనినీళ్ళలో వేసి కాచిన తరువాత నీలిరంగు వచ్చును. చిక్క బడిన అరంగును వెడల్పగు కాగులలో వేసి సన్నని మంట మీద కాక బెట్టుచు సున్నము నీళ్ళు జల్లుచున్న యెడల రంగు అడుగునకు దేలును.

వరినీలి:- మెట్టనేలల మీద బెరుగును. ఆకులందు మూడేసి చిట్టియాకులు గలవు. పువ్వులుఎరుపు. కాయలు నాలుగుపలకలుగానున్నవి.

జనుము:- 10 అడుగుల వరకు కూడ పెరుగును. ఆకులు మిశ్రమపత్రములు గావు. వీనితొడిమలు పొట్టివి. ఆ