పుట:VrukshaSastramu.djvu/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫలము లో పెంకుకాయ. జాజికాయంతయుండును. రెండో, మూడోగింజలున్నవి.

ఈ కుటుంబపు చెట్లు ప్రపందమునందన్ని చోట్లను గలవు. వీనిలో చెట్లు, గుబురు మొక్కలే గాని గుల్మము లంతగా లేవు. ఆకులు ఒంటరి చేరిక, కణుపు పుఛ్చము లుండవు. పుష్పములు చిన్నవి. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు అయిదైదు గలవు. కింజల్కములు నాలుగో, ఎనిమిదో యుండును గాని, అయిదో, పదీ యుండవు. కింజల్కముల చుట్టు నొక పళ్ళెరము గలదు. సాధారణముగ గింజలకు బీజ పుచ్ఛములుండు చుండును.

కుంకుడు:- చెట్లు మన్యము లందును, అడవుల లోను బెరుగు చున్నవి. కాని వానినెవరు శ్రద్ధతో పెంచునట్లు లేదు. కుంకుడు కాయలను చిరకాలము నుండియు దేహము రుద్దుకొనుటకు నుపయోగించు చున్నారు. సబ్బుకంటె మంచిదని వీనితోడనే శాలువలను, పట్టును ఉతుకు చున్నారు. వెండి, బంగారు నగలను కూడ మురికి వదలుటకు వీనితో తోమెదరు. మరియు ఏలక కాయలను కూడ కుంకుడు రసముతో రుద్దుదురు.

రౌటంగచెట్టు:- అడవులలో బెరుగు చున్నది. దీని గింజలనుండి విలువగు చమురు వచ్చు చున్నది. ఈచము రౌ