అండకోశము:- అండాశయము ఉచ్చము. మూడు తమ్మెలు గలవు. కీలము 1 గుండ్రము. కీలాగ్రము గుండ్రము. గిజకు బీజ పుఛ్చము గలదు.
రౌటంగచెట్టు అడవులలో పెరుగుచున్నది.
ఆకులు:- కొమ్మల చివరల నుండును, ఒంటరి చేరిక. మిశ్రమ పత్రములు 8" అం. మొ..... 16" అంగుళముల వరకు పొడుగు. చిట్టి యాకులు మూడు నాలుగు జతలుండును. వీనికి తొడిమలేదు. బల్లెపు నాకారము. సమాంచలము. రెండు వైపుల నున్నగా నుండును.
పుష్పమంజరి:- లేత కొమ్మల మీద కణుపు సందుల నుండి వచ్చు చున్నవి. వీనిలో మిధున పుష్పములో పురుష పుష్పములో గలవు.
పురుషపుష్పము.
పుష్పకోశము:- సయుక్తము. గిన్నెవలె నుండును. 5 దంతములు గలలవు. నీచము.
దళవలయము: లేదు.
కింజల్కములు:- 6 కంటె నెక్కువ యున్నవి. పొడుగుగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు. కింజల్కముల చుట్టు బళ్ళెరము గలదు.
అండకోశము:- గొడ్డు అయినది.
మిధునపుష్పము:- పుష్ప కోశము, దళ వలయము, కింజల్కములు పై దాని లోపలనే యుండును.
అండకోశము:- అండాశయము ఉచ్చము 3 గదులు. అండాకారము. కీలము పొట్టి. కీలాగ్రము మూడు చీలికలు.