పుట:VrukshaSastramu.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వగు బట్టలవంటి వానిని నేయుటయు గష్టమనియే కనుపట్టు చున్నది. ఈ బట్టలను నేసిన సాలీలనే అమెరికా దేశపు నూలుతో నేయమనిన వస్త్రములు నేయజాలకపోయిరి. ఈ ప్రత్తి చలువ చేయుట వలన నుబ్బి బిరుసగును కాని మన దేశపు ప్రత్తి వలె సన్నము గాదని జెప్పుదురు. ఇప్పుడు మన దేశములో నూలు బట్టలు యంత్ర శాలలు చాలనె గలవు కాని ఉండవలసినన్ని లేవు. ఈ సంగతి, మన దేశమును గొన్ని యితర దేశాలతో బోల్చిచూచిన తెల్లము కాగలదు. 1901 సంవత్సరములో ఇంగ్లాండు నందు 2077 మరలును, అమెరికాలో 1123 మరలును, జర్మినీ 390 మరలును మన దేశమున 203 ను జపాను నందు 64 గలవు. ఇప్పుడు మ్న దేశమందు 258 మరలు గలవు. అయిన నిచ్చట నేయునవి చాలక వీనికి మూడు రెట్లన్య దేశముల నుండి దిగుమతి చేసుకొను చున్నాము. మొట్టమొదట మన దేశమునకు వచ్చెడు నూలు సరకుల మీద బన్ను గలదు. కొంత కాలమైన పిదప దానిని గొట్టి వేసిరి. కొట్టి వేసిన యెడల మన దేశపు యంత్రములకును జేతి పనులకును అభివృద్ధి గలుగదని గట్టిగా పట్టు బట్టగా సన్న రకముల బట్టల మీద మాత్రము పన్ను గట్టుచు వచ్చిరి. ఈ సన్న రకపు బట్టలకంతగా అమ్మకము లేదు. ముతక బట్టలు మన దేశములోనే చౌకగ వచ్చు చుండెను. ఎక్కువ అమ్మక