పుట:VrukshaSastramu.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగల మధ్యరకము బట్టలు మన దేశములోను నేయుచుండిరి; కావున దిగుమతి అయ్యెడు వానిపై బన్నుగట్టిన నవి ప్రియమై వాని ఖర్చు తగ్గును. అందుచే నితర దేశములలో నేయు వాని యమ్మకము దగ్గును. అందుచే నితర దేశములలో నేయు వాని యమ్మకమును దగ్గును. ఈ హానినివారించుటకు నిరువది నెంబరు పై నున్న బట్టల కెల్ల మన దేశములో నేసినను, పైనుండి వచ్చినను సమముగానే పన్ను వేయుచు వచ్చిరి. చేతి మగ్గముల మీద మాత్రము పన్ను లేదు.

ప్రత్తి గింజల నుండి మంచి నూనె వచ్చును గాని మన దేశములో దీయుట లేదనియే చెప్పవచ్చును. కొన్ని దేశముల వారీ నూనెను వంటలందును వాడు కొనెదరు. గింజలు పశువులకు బెట్టెదరు. నూని తీసిన పిదప దెలక పిండిని గూడ పశువులకు బెట్టవచ్చును.

ప్రత్తి గింజలను, లేత చిగుళ్ళను కాయలను ఔషధములలో వాడుదురు. గింజలు, జీలకర్ర ---- సోపు కలిపి నూరి, రసము దీసి దినమునకు నాలుగైదు సార్లు బుచ్చుకొనిన యెడల కొన్ని సుఖ వ్యాధులు తగ్గునందురు.

ప్రత్తి మిగుల నుపయోగమైన పదార్థము. మన బట్టలు, పరుపులు, దీపము వత్తులు అన్నియు ప్రత్తి మూలముననే వచ్చుచున్నవి.