పుట:VrukshaSastramu.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొలములో నున్న చెట్లన్నియు ఫలించిన గాని కోయుట కారంభించరు.

గింజల నుండి ప్రత్తి విడదీయుటకు సాధనములు చిరకాలము క్రిందటనే మనదేశమున గలవు. అలెగ్జాండరు మన దేసముపై దడెత్త వచ్చినపుడు అతనితో వచ్చిన శాస్త్రజ్ఞలు కొందరు వీని యుపయోగములను దెలిసికొని వారి దేశములో వింతగ జెప్పిరి. ఇప్పటి యంత్రములను పూర్వపు వాని వలెనే యుండును గాని వీనితో ఆవిరి సాయమున బని చేయ వచ్చును. అందుచే నివి లాభకారులు. ఆవిరి యంత్రములు వచ్చినప్పటి నుండియు నూలు బట్టలు నేయుట సులభమయ్యెను. యంత్రశాలలు పెక్కు తావుల స్థాపించబడెను. బట్టల ధరయు దగ్గెను. అయినను నేత బట్టల వాడుక పోలేదు. సాలీలు ఇప్పటికిని బట్టలు నేయుచు అమ్ముచున్నారు. దీనికి నేత బట్టలను కట్టుకొన నిచ్చగలిగియుండుటయు, మరలతో నేసిన వాని మాన గోరుటయు ముఖ్య కారణములు గాని మరలతో నేసినవి తక్కువ రకములని గాదు. పగ్గములతో నేసిన వానికంటె సన్నని మెత్తని బట్టలను యంత్రశాలలందు నేయుచున్నారు. కాని వీనితో జిత్ర విచిత్రముగ బొమ్మలు తీగెలు గళ్ళు నేయుట పగ్గములతో నేయుట కంటె గష్టమైన దన్నది నిజమే. డక్కా పట్టణమందిది వరకు నేసెడు మిక్కిలి మృధు