పుట:VrukshaSastramu.djvu/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

లో నెంతలోతుననున్నవో యంత లోతుననే పాతవలెను. ఎక్కువ లోతుగ బాతినచో మొక్కకు హాని వచ్చును. పైకిబాతిన యెడల వేళ్ళుపైపైననే యుండి చచ్చి పోవుట తటస్థించును. వీనిని పాతగనే వర్షముకురిసెనా , చేయవలసిన పని వాని చుట్టు గడ్ది మొక్కలను లేకుండ జూచుటయే. ఒకవేళ వర్షము కురియకున్నచో నీరు పోయవలెను. వీనికి నీటి యాధారము బాగుగ నుండ వలెను. చేలలో ముప్పది నలుబది యడుగుల దూరమున మూడడుగులు లోతు గల కాలువలుండవలెను.

తరువాత, తేయాకు మొక్కలను గత్తిరించుట మిక్కిలి జాగరూకతతోజేయవలెను. హిందూస్థానము నందు మార్గశిరము, పాల్గుణ మాసముల మధ్య కత్తిరించు చుందురు. గాని దక్షిణ దేశమునందట్టి నియమిత కాలము లేదు. మొక్క లెదుగని కాలములో గత్తిరించుట మంచిది. ఏడాది మళ్ళలో బెరిగిన మొక్కలను చేనులో నాటిన నొక నెలకును, ఆరునెలలలో బెరిగిన దానిని ఆరునెలలకు గత్తిరించ వలెను. అస్సాము తేయాకును ఆరంగుళముల ఎత్తులోపునను మణిపూరు తేయాకును ఎనిమి దంగుళముల ఎత్తులోపలను గత్తరింపరాదు. ఆ దుబ్బు నుండి మూడు నాలుగు కొమ్మలు బయలు