పుట:VrukshaSastramu.djvu/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

103

అడుగులెత్తు వరకు గూడ బెరుగును. వాని కాయలు పెద్ద వగుటకు సంవత్సరము పట్టును. విత్తనములను, నాలుగైదు అడుగుల వెడల్పున మళ్ళు చేసి ఎరువేసి, అరడుగు దూరమున బాతెదరు. అది వరకచ్చోట చెట్లుండినచో వాని మొదళ్ళను బూర్తిగ లాగి వేయవలెను. రాళ్ళున్నచో వానిని త్రవ్వి వేయవలెను. అదివరకక్కడ తేయాకు మొక్కలే మొలచి నచో నెరువు బాగుగ వేయ వలయును. ఆరు మాసములో సంవత్సరమో ఈ మళ్ళలో నున్న తరువాత వానిని దీసి పొలములో బాతుదురు. పాతు నప్పుడు ఒక దాని కొకటి నాలుగడుగుల కంటె దగ్గర గానుండుట గాని, అయిదడుగుల కంటె దూరముగా నుండుట గాని మంచిది గాదు. ఇట్లు పాతిన యెడల ఇంచుమించు ఎకరమునకు 2,000 మొక్కలు పట్టును. ఇప్పుడు చాల చోట్ల త్రిభుజాకారముగను నాలుగున్నర అడుగుల దూరమునను బాతు చున్నారు. చేలలో నీ దూరములను మొక్కలు పాత వలసిన చోట్లను యానవాళ్ళు పెట్టుకొనిన తరువాత గోతులు తీసి మళ్ళలో నుండి చిన్న మొక్కలను దెచ్చి పాతవలెను. వానిని దెచ్చునపుడడుగున కొంత మట్టితో గూడ దీసికొని రావలెను. తల్లివేరెటైనను వంగి యున్నచో దానిని వంగిన చోటగోసివేయుటమంచిది. పిల్ల వేళ్ళను విప్పారియున్న వానిని దగ్గిరగా దీసికొని రారాదు. మరియు నవి మళ్ళ