పుట:VrukshaSastramu.djvu/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

105

దేరును. వానిని రెండేండ్ల వరకు కత్తిరింప కూడదు. మూడవ యేట పదునాలుగో పదునెనిమిదియో అంగుళము లెత్తు పయిన గత్తిరింతురు. అటు పిమ్మట ప్రతి సంవత్సరము నిరుడు కత్తిరించిన దాని కొకటి రెండంగుళము లెత్తుగా గత్తిరించ వలెను. బహుశః లేత చిగుళ్ళంత కంతకు తగ్గిపోవుచుండును. అప్పుడు మరల మొక్కను 12, 15 అంగుళముల ఎత్తుపైన గత్తిరింప వలసి వచ్చును. బాగుగా నెదుగవని తోచిన కొమ్మలను లాగి వేయుట మంచిది. నీరసముగా నుండి, నేల మీద పడియున్న వానీ త్రుంపి వేయవలయును. చచ్చిన కొమ్మల సలే యుండనీయ రాదు. గుబురు ప్రక్కనున్న కొమ్మలను మధ్యగా నున్న వానిని ఒకటే ఎత్తునకు గత్తిరించ వలెను. క్రొత్తగా నేర్పడిన దారువు రెండంగుళముల కంటె నెక్కువుండరాదు.

అట్లు కత్తిరించిన రెండు మూడు నెలల వరకు సుమారు తొమ్మిది అంగుళముల ఎత్తున క్రొత్త కొమ్మ లెదుగును. అప్పుడు వానిని త్రుంపుదురు. మధ్యనున్న కొమ్మమీద రెండాకులున్నప్పుడే త్రుంపుట నారంభింతురు. చివరనున్న రెండాకులులనే గోయుదురు. వానిని గోయుటకు ఆకులను పట్టుకొని లాగరు. మనకు కావలసినది లేత ఆకులును చిగుళ్ళును గా