పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66


కొనుచుండుటలో ఇబ్బందులు కలుచుంగుడెను. ఈ లోపమును నంస్కరించుటకై గదే నిజాం ప్రభువు వారు తమ సొంత వ్యయమునకై అట్రాఫుబల్గా జిల్లా యను దానిని కల్పించి ప్రత్యేకించి యుంచిరి. ఈ జిల్లా ప్రభువు గారి యొక్క సొంత వ్యయమున కేర్చడినందున దీనిని ఫార్సీలో " సర్సెలాస్ " అనియు వ్యవహరింతురు. సర్ఫెఖాసు నుండి ప్రతి సంవత్సరము పన్నుల రూపమున సునూరు అర్ధకోటి రూపాయీలు పసూ లగును. ఈ మొత్తము గాక ప్రభువుగారికి (దీవానీ) రాష్ట్రప్రభుత్వ కోశము నుండి ఏటేట 5 లక్షల రూపాయీలు సమర్పించుకొను ఏర్పాటు కూడగలదు. ఈ సర్ఫేఖాసు మండలములో వ్యవస్థనంతయు మ. ఘ. వ. నిజాం ప్రభువు గారె స్వయముగా విచారించుకొందురు. అట్లుండినను పోలీసు శాఖను మాత్రము ఖాల్సా అనగా నేరుగా ప్రభుత్వము చేత పాలింప బము రాజ్యంగముయొక్క అధీనములో నిచ్చియున్నారు. అత్రాపుబల్టా జిల్లాలో మంచి సమర్ధత కల జిల్లా పోలీసు అధి కారియొక్క యవసరము చాల కలదని హెంకిన్ గారితో ఆలోచించగా వారు వేంకట రామారెడ్డిగారు తప్ప మరెవ్వ రును సరియైన వారు లేరని వారి సచ్చటికి 425 రూపాయీల జీతము పై పంపిరి.