పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

67


అత్రాఫుబర్గా జిల్లాలో రెండేండ్లు కూడ పనిచేయక మునుపే వీరు వనపర్తిలో ఉద్యొగము చేయవలసి వచ్చెను. వీరి సమకాలికులును, సమవయస్కులును. సహాధ్యాయులును, బాల్యమిత్రులును, బంధువులును అయిన వనపర్తి రాజుగారగు శ్రీ (ద్వితీయ) రాజా రామేశ్వర రావు బహద్దరుగారు ప్రభుత్వము వారితో ఉత్తరప్రత్యుత్త రములు జరిపి వేంకట రామా రెడ్డి గారిని తమ సంస్థానమునకు రప్పించిస సంస్థాన కార్యదర్శి (Secretary ) గా నియమించిరి. నెలకు 900 రూపాయీల జీతము నిచ్చుచుండిరి.1321 ఫసలీ వీరాయుద్యోగ ముందు ప్రవేశించి రెండు సంవత్సరముల కాలము వరకు నిర్వహించు చుండిరి

. వేంకట రామారెడ్డి కారు అతాఫుబల్గాజిల్లా పోలీసు మొహ తెమీముగా నుండిన కాలములో పూర్వపు నిజాము గారైన నవ్వాబ్ మీర్ మహబూబు ఆలీఖాన్ బహద్దకు గారు రాజ్యము చేయుచుండిరి. వారి స్వంత వ్యయము కై ప్రత్యేకింపబడిన ఆత్రాఫు బల్లా జిల్లా కే రెడ్డిగారు పోలీసు అధి కారిగా నుండిరి, గత నిజాముగారగు సవాబు మీర్ మహ బూబు అలీఖాన్ బహద్దరుగారు మొగల్ చక్రవర్తుల మర్యాదలను అనుసరించిన తుది ప్రభుపు అనవచ్చును. వారి నిజమైన జీవిత చరిత్రను మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహ