పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68


ద్దరు వంటివాడు వ్రాయవలసి యుండెను. గత నిజముగారిని గురించి రాష్ట్రమంతటను, సామంత ప్రభువులును, ప్రజలను కొల్లలుగా కథలు చెప్పుకొను చుందురు. అంద నేకములు చాల వినోదకరములుగా నుండును. వారెన్నియో మాసముల కొకమారు జనులకు దర్శనమిచ్చు చుండిరినియు, వారు బయటికి వెళ్లినప్పుడు వేలకొలది ధనమును వీధులలో చల్లుచు పోవుచుండి రనియు, మహా దాతలనియు, వారిదర్బారు మొగలు చక్రవర్తుల దర్బారువలె సర్వ మర్యాదలతో కూడి యండినట్టి దనియు వారికి సర్వ మతములందు సహనదృష్టి యుండెననియు, ప్రజ లందరు వారిని పూజ్య భావముతో ప్రేమించుచుండి రనియు జనులు నేటికిని విరివిగా చెప్పుకొను చుందరు. గత నిజామ గారి సర్ఫేఖాసులో రెడ్డిగారు పోలీసు ప్రధానోద్యోగులుగా నుండినను వారి సమక్షములో పోవుటకు గాని, వారితో మాట్లాడుటకుగాని వారి కవ'కాశము కలుగ లేదు. అయినను వారి కాలములో రెడ్డి గారికి సంబంధించిన యొక ముఖ్యమగు ఘట్టము పేర్కొనదగినదై యున్నది. గత నిజాముగారు హైదరాబాదు నగరమునకు ఇంచుమించు అరు మైళ్ళ దూరమున నుండి నట్టి పహాడెపరీఫ్ అను స్థలమందు నివాసము చేయుచుండిరి. నగరమునుండి ప్రతి దినము సాయంకాలము వారి నౌకరులలో ఒక గుంపు అచ్చటికి వెళ్ళి అచ్చట